ఇరాన్‌లో జంట పేళుళ్ళు.. 103 మందికి పైగా మృతి
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసిం సులేమాని నాలుగో వర్ధంతి రోజున ఆయన సమాధికి సమీపంలో జరిగిన జంట పేలుళ్లలో 103 మందికి పైగా మరణించినట్లు మీడియా వెల్లడించింది.

141 మందికి గాయాలు
టెహరాన్ : ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసిం సులేమాని నాలుగో వర్ధంతి రోజున ఆయన సమాధికి సమీపంలో జరిగిన జంట పేలుళ్లలో 103 మందికి పైగా మరణించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కెర్మన్ నగరంలోని సాహెబ్ అల్ జమాన్ మసీద్ సమీపంలో ఒక ఊరేగింపు జరుగుతుండగాఈ పేలుళ్ళు జరిగాయని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ అధికారిక మీడియా పేర్కొన్న దాని ప్రకారం రెండు భయంకరమైన పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య 103కి పెరిగిందని ఎమర్జెన్సీ సేవలను అందించే సంస్థ తెలిపింది. పేలుళ్ల కారణంగా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు చెప్పింది. ఘటన స్థలం నుంచి ఇప్పటివరకు 50 మందిని తరలించినట్లు సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. గాయపడిన వారిని రక్షించేందుకు వెళ్లిన ముగ్గురు రెస్క్యూ సిబ్బంది రెండో పేలుడు ఘటనలో మరణించినట్లు రెడ్ క్రాస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం వెల్లడించింది.
దీన్ని ఒక ఉగ్రవాద దాడి అని కెర్మన్ డిప్యూటీ గవర్నర్ వ్యాఖ్యానించినట్లు తెలిపింది. పేలుళ్ల కారణంగా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు చెప్పింది. ఇప్పటివరకు 50 మందిని తరలించినట్లు కెర్మన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. గాయపడిన వారిని రక్షించేందుకు వెళ్లిన ముగ్గురు రెస్క్యూ సిబ్బంది రెండో పేలుడు ఘటనలో మరణించినట్లు రెడ్ క్రెసెంట్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం వెల్లడించింది. ఆన్‌లైన్‌లో ప్రచారం అవుతున్న ఒక వీడియో నేల మీద అనేక శవాలు పడి ఉన్నట్లుగా చూపుతోంది. అమెరికా డ్రోన్ దాడిలో 2020లో మరణించిన జనరల్ సులేమాని నాలుగో వర్ధంతిని పురస్కరించుకొని వందలాదిమంది బుధవారం ఆయన సమాధి వైపు ఊరేగింపుగా వెళుతున్నట్లుగా సోషల్ మీడియా వీడియోలు చూపుతున్నాయి. పది నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు, రెండు బాంబులు పేలడం వల్ల ఈ విస్ఫుటనం సంభవించినట్లు కెర్మన్ మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్ చీప్ షహబ్ సాలేహి చెప్పారు.
ఈ పేలుళ్లు 10 నిమిషాల వ్యవధిలో జరిగినట్లు తెలిపారు. బాంబులను రెండు బ్యాగుల్లో పెట్టి వాటిని రిమోట్ ద్వారా పేల్చినట్లు ఇరాన్ న్యూస్ ఏజెన్సీ తస్లీమ్ పేర్కొంది. వీలైనంత త్వరగా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రజల్ని అధికారులు కోరారు. భయంతో పరుగులు పెడుతున్న ఫోటోలను ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది.
ఖాసిం సులేమాని సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమేనీ తర్వాత అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా పరిగణించేవారు. సీక్రెట్ ఆపరేషన్ విభాగం ఫోర్స్ కమాండర్ గా ఆయన పని చేశారు. ఇరాన్ పాలసీ రూపశిల్పిగా ఉండేవారు. ఇరాన్ రహస్య మిషన్లకు ఆయన ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. గ్రూపులు, ప్రభుత్వ మిత్రపక్షాలకు మార్గదర్శకత్వం, నిధులు ఆయుధాలు, ఇంటెలిజెన్స్ లాజిస్టికల్, మద్దతును అందించేవారు, 2020లో జనరల్ ఖాశీం హత్యకు ఆదేశించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సులేమానిని ప్రపంచంలోని నెంబర్ వన్ టెర్రరిస్ట్ గా పేర్కొన్నారు.