Viral Video | కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్.. ఇద్దరు మృతి

Viral Video | గుజరాత్లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బనస్కాంత జిల్లాలోని పాలన్పూర్ – అంబాజీ మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇటీవలే పిల్లర్లకు ఆరు కాంక్రీట్ స్లాబులను అమర్చారు. సోమవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి.. ఆరు కాంక్రీట్ స్లాబులు కుప్పకూలిపోయాయి. బ్రిడ్జి కింద ఉన్న రిక్షా కార్మికుడితో పాటు మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బ్రిడ్జి కూలుతుందన్న విషయాన్ని గ్రహించిన యువకుడు పరుగు పెట్టినా కూడా ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. ట్రాక్టర్, ఆటో కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. ఆ ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను అజయ్ శ్రీమలై(30), మయూర్ పర్మార్(20) గా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై గుజరాత్ సీఎం తీవ్రంగా స్పందించారు. ప్రమాదానికి గల కారణాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ఇంజినీర్లను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. రూ. 89 కోట్ల వ్యయంతో జీపీ చౌదరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నట్లు తెలిసింది.
✴ #Gujarat flyover collapse
▶️#gujaratmodel with #Doublengine sarkar during #AmritKaal #BJPFailsIndia #BJP4IND #Telangana #TelanganaElections2023 pic.twitter.com/ISNgUyzVu9
— Arjun (@arjunactual) October 23, 2023