ముంబైకి మ‌కాం మార్చే ఆలోచ‌న‌లో రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు.. ఈ నిర్ణ‌యం వెనక కార‌ణం ఏంటి?

ముంబైకి మ‌కాం మార్చే ఆలోచ‌న‌లో రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు.. ఈ నిర్ణ‌యం వెనక కార‌ణం ఏంటి?

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. చిరంజీవి కుమారుడిగా సినీ రంగంలో అడుగు పెట్టిన ఇతడు.. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోగా ఎదిగాడు. చిరుతతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాధించుకున్న చ‌ర‌ణ్ త‌ర్వాత చిత్రంగా మగధీర సినిమా చేయ‌గా, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో ఆయన రేంజ్ మరింత పెరిగిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్‌గా మారాడు. కెరియర్ పరంగా అద్భుతమైన సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న ఇతడు.. పర్సనల్ లైఫ్ లో కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు.

2012లో జూన్ 14వ తేదీన ఉపాసనను ప్రేమించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట‌కి పదకొండేళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మించింది. ఇక ఇటీవ‌ల చరణ్, ఉపాసన దంపతులు వరల్డ్ టాప్ మ్యాగజైన్ పై కనిపించారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చరణ్ దంపతులు వండర్ ఫుల్ స్టిల్ ఇచ్చారు. అందులో చరణ్ ఉపాసన, పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో మెర‌వ‌గా ఈ పిక్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. పిక్‌లో ఉపాసన సోఫాలో కూర్చోగా.. చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చోవడం ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియా హీరో అయిన తర్వాత పలు కార్యక్రమాలు ఈవెంట్లు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. కెరియర్ పరంగా ఎక్కువ భాగం ముంబైలోనే నివసిస్తూ ఉన్నారు.

తరచు ఏదో ఒక ఈవెంట్ ద్వారా ముంబైకి వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు బాలీవుడ్ నుండి ప‌లు ఆఫ‌ర్స్ వ‌స్తుండ‌గా, వాటిని హోల్డ్ లో పెడుతున్నాడు. రాజ్ కుమార్ హిరాణి కూడా చరణ్ కు కథ చెప్పాడట. ఇలా బాలీవుడ్ తో చరణ్ బంధం బలపడుతున్న నేప‌థ్యంలో అక్క‌డ ఓ ఇల్లు తీసుకోవాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట చ‌ర‌ణ్‌. ముంబై వెళ్లిన‌ప్పుడ‌ల్లా రెంట్లు తీసుకోవడం కంటే.. ఓ ఇల్లు కొంటే సరిపోతుందని భావిస్తున్నారట మెగా ప్యామిలీ. మెగా ఫ్యామిలీకి హైదరాబాద్ తో పాటు.. చెన్నైలో కూడా ఆస్తులున్నాయి. బెంగళూరులో పెద్ద ఫామ్ హౌస్ కూడా ఉంది. కాని ముంబయ్ లోనే ఆస్తులు లేని క్ర‌మంలో అక్క‌డ ఓ ప్రాప‌ర్టీ తీసుకుంటే బాగుంటుంద‌ని రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం.