సైలెంట్‌గా జ‌రిగిన వెంక‌టేష్ కూతురి నిశ్చితార్ధం.. చిరు, మ‌హేష్‌ల‌తో పాటు..!

సైలెంట్‌గా జ‌రిగిన వెంక‌టేష్ కూతురి నిశ్చితార్ధం.. చిరు, మ‌హేష్‌ల‌తో పాటు..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సంద‌డి నెల‌కొంది. హీరోలు, హీరోయిన్స్‌తో పాటు వారి కుటుంబ స‌భ్యుల‌లోను వేడుక‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా వెంక‌టేష్ కూతురి నిశ్చితార్థం సైలెంట్‌గా జ‌రిగింది. విక్ట‌రీ వెంకటేష్ ద‌గ్గుబాటి రామానాయుడు వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా మారాడు. వెంక‌టేష్ సినిమాల‌కి మినిమం గ్యారెంటీ ఉంటుంది. 36 సంవత్సరాల నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన వెంకీ తన నటనద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో వెంకీ గా కొలువు తీరారు. ఇటువంటి తరుణంలో వెంకీ కుటుంబంలో జ‌రిగిన వేడుక గురించి తెలుసుకొని అభిమానులు మురిసిపోతున్నారు.

వెంక‌టేష్‌కి న‌లుగురు పిల్ల‌లు ఉండ‌గా, వారిలో పెద్ద కుమార్తె వివాహం ఎప్పుడో చేశారు. ఇక రెండో కూతురు వివాహంకి సంబంధించి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సైలెంట్‌గా వెంకటేష్‌ రెండో కూతురు హయవాహిని ఎంగేజ్‌మెంట్ విజయవాడలో జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. విజయవాడకి చెందిన ప్రముఖ డాక్టర్‌ కుటుంబంతో వెంకటేష్‌ వియ్యం అందుకుంటున్నారని, వీరి ఎంగేజ్‌మెంట్‌ బుధవారం జరిగిందని తెలుస్తుంది. అయితే పెద్దగా ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఈ వేడుకని నిర్వహించ‌డం విశేషం. ఇక ఈ నిశ్చితార్థ వేడుక‌కి మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది.

వెంక‌టేష్ త‌న ఫ్యామిలీకి సంబంధించిన విష‌యాలు బ‌య‌ట‌కు రానివ్వ‌డు. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రీత వివాహం సంవత్సరం క్రితం ఆమె ప్రేమించిన వ్యక్తితో అతిరథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన విష‌యం తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో కూతురుని విజయవాడ కి చెందిన ఒక డాక్టర్ కొడుకుతో ఘ‌నంగా జ‌రిపించ‌నున్నాడు. దగ్గుబాటి కుటుంబంలో రానా పెళ్లి త‌ర్వాత ఇప్పుడు ఈ పెళ్లితో వివాహ సంద‌డి నెల‌కొన‌నుంది. ఇక వెంక‌టేష్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఇటీవ‌ల మ‌ల్టీ స్టార‌ర్, రీమేక్ చిత్రాలు ఎక్కువ‌గా చేస్తున్నాడు. వెంకీ తాజాగా సైంధవ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఆ చిత్ర ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుండ‌గా, ఈ మూవీ పెద్ద హిట్ సాధిస్తుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు భావిస్తున్నారు.