అట్ట‌హాసంగా జ‌రిగిన వెంక‌టేష్ రెండో కూతురు పెళ్లి.. ఎవ‌రెవ‌రు హాజ‌ర‌య్యారంటే!

అట్ట‌హాసంగా జ‌రిగిన వెంక‌టేష్ రెండో కూతురు పెళ్లి.. ఎవ‌రెవ‌రు హాజ‌ర‌య్యారంటే!

విక్ట‌రీ వెంక‌టేష్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి.వెంకటేష్‌కు నలుగురు సంతానం కాగా, వారిలో ముగ్గురు అమ్మాయిలు, చివరిగా కుమారుడు అర్జున్ జన్మించాడు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం నాలుగేళ్ల క్రితం 2019 మార్చి నెలలో జైపూర్‌లో అట్ట‌హాసంగా జ‌రిపించాడు వెంకీ. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం జ‌రిగింది. ఇప్పుడు ఈ జంట స్పెయిన్‌లో నివ‌సిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో త‌న రెండో కూతురు హ‌వ్య వాహిని నిశ్చితార్థం జ‌రిపించారు వెంక‌టేష్‌. ఈ వేడుక‌కి చిరంజీవి, మ‌హేష్ బాబు, రానా, నాగ చైత‌న్య‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇక‌ శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్‏ తో హ‌వ్య‌వాహిని వివాహం అట్ట‌హాసంగా జ‌రిగింది.

రామానాయుడు స్టూడియోలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లిని ఘ‌నంగా జ‌రిపించారు. సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన సెల‌బ్రిటీలు ఎవ‌రు పెద్ద‌గా హాజ‌రైన‌ట్టు లేదు. గురువారం జరిగిన మెహందీ ఫంక్షన్ లో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత.. ఆయన కూతురు సితార పాల్గొని సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోల‌కి నెటిజ‌న్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. కొత్త దంప‌తుల‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నార‌ని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాల‌తో వారిద్ద‌రు క‌లిసి ఉండాలని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే మెహందీ వేడుక‌లో పాల్గొన్న న‌మ్ర‌త కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ.. ‘నూతన వధూవరులు జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మెహందీ రోజు మంచి టైమ్ స్పెండ్ చేశాం అంటూ త‌ను షేర్ చేసిన ఫోటోల‌కి కామెంట్ చేసింది. ఆ పిక్స్ కూడా వైర‌ల్ అయ్యాయి. మొత్తానికి వెంకీ ఇద్ద‌రి కూతుళ్ల‌కి పెళ్లిళ్లు కాగా వెంకటేష్ మూడో కుమార్తె భావన ప్రస్తుతం ఉన్నత విద్యను విదేశాల‌లో అభ్యసిస్తున్నారని సమాచారం. అలాగే, అర్జున్ దగ్గుబాటి కూడా విదేశాల్లో చదువుకుంటున్న‌ట్టు తెలుస్తుండగా, అత‌నిని సినిమాలలోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.