ర‌ష్మిక‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేమ‌, పెళ్లి… ఎట్ట‌కేల‌కి క్లారిటీ ఇచ్చిన రౌడీ బాయ్

  • By: sn    breaking    Jan 19, 2024 11:36 PM IST
ర‌ష్మిక‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేమ‌, పెళ్లి… ఎట్ట‌కేల‌కి క్లారిటీ ఇచ్చిన రౌడీ బాయ్

సినిమా ఇండస్ట్రీ లో ఎఫైర్స్ గురించి నిత్యం ఎన్నో ర‌కాల రూమర్స్ హల్‌చ‌ల్ చేయ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. కొన్ని ఆ రూమ‌ర్స్ నిజం అవుతున్నా మ‌రి కొన్ని సార్లు పుకార్లుగానే మిగిలిపోతుంటాయి. గత కొన్నిరోజులుగా విజయ్-రష్మికలు ప్రేమ‌లో మునిగి తేలుతున్నార‌ని, ఇద్ద‌రు క‌లిసి చెట్టాప‌ట్టాలు వేసుకుంటున్నార‌ని ప్ర‌చారాలు సాగాయి. ఇక వీరిద్ద‌రి ఎంగేజ్ మెంట్ ఫిబ్రవరిలో జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన‌ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రచారం నిజమో కాదో అనేది స్వయంగా రౌడీ హీరోనే క్లారిటీ ఇచ్చేశాడు.

రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ ఒకే చోట ఉన్నట్టుగా నెటిజ‌న్స్ ఇప్ప‌టికే చాలా ఫ్రూప్స్ చూపించారు నెటిజన్లు. దీంతో ఈ ఇద్దరు కలిసే తిరుగుతున్నారని, ప్రేమలో ఉన్నారని కన్పమ్‌ చేస్తున్నారు. ఈ ఇద్దరి డేటింగ్‌ విషయం గత రెండు మూడేళ్లుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండ‌గా, దీనిపై ప‌లుమార్లు విజ‌య్, ర‌ష్మిక స్పందించారు. తాము ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతూ వచ్చారు. లవ్‌ లో ఉన్నారనే విషయంలో మాత్రం ఆచితూచి మాట్లాడారు. అది నిజం కాదనే విషయాన్ని మాత్రం చెప్ప‌క‌పోవ‌డంతో ప్ర‌చారాలు సాగుతూనే ఉన్నా యి..ఫిబ్రవరిలోనే వీరు పెళ్లికి సిద్ధమయ్యారని, ఇక ఈ జంట ఒక్కటి కాబోతుందని, ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారంటూ ప్ర‌చారం సాగుతుండ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించారు.

ఇంగ్లీష్‌ మేగజీన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ అసలు విషయం చెప్పారు.. మీడియా నాకు ప్రతి ఏడాది పెళ్లి చేయాలని చూస్తుంది. ప్రతి సారి ఇలాంటి రూమర్స్ వింటూనే ఉన్నాను. దొరికితే పెళ్లి చేయాలనుకుంటున్నారు అంటూ సెటైరికల్‌గా, ఫన్నీగా విజయ్ దేవ‌ర‌కొండ బ‌దులు ఇచ్చారు. మొత్తానికి విజ‌య్ దేవ‌ర‌కొండ , ర‌ష్మిక బంధంపై ఓ క్లార‌టీ అయితే వ‌చ్చింది కాని ఈ రూమర్స్ ఇంత‌టితో ఆగుతాయా లేదంటే మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తూనే ఉంటాయా అనేది చూడాలి.