రాఘవేంద్ర స్వామిని పూజిస్తే క‌లిగే శుభ ఫ‌లితాలివే..? మ‌రి తుల‌సి మాల స‌మ‌ర్పించొచ్చా..?

రాఘ‌వేంద్ర స్వామి ఎంతో మ‌హిమ‌గ‌ల దేవుడ‌ని అంద‌రి విశ్వాసం. స్వామి వారిని పూజించ‌డం వ‌ల్ల ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. స్వామి వారిని ఏడు వారాల పాటు నియ‌మ‌నిష్ట‌ల‌తో పూజించి, క‌ఠిన ఉప‌వాస దీక్ష‌లు చేయ‌డం ద్వారా మ‌నం అనుకున్న ఎటువంటి కార్య‌క్ర‌మాలు అయినా నెర‌వేరుతాయి.

రాఘవేంద్ర స్వామిని పూజిస్తే క‌లిగే శుభ ఫ‌లితాలివే..? మ‌రి తుల‌సి మాల స‌మ‌ర్పించొచ్చా..?

శ్రీ గురుద‌త్త రాఘ‌వేంద్ర స్వామికి గురువారం అత్యంత ప్రీతిక‌ర‌మైన రోజు. క‌ర్నూల్ జిల్లా మంత్రాల‌యంలోని రాఘవేంద్ర స్వామి ఆల‌యం ఎంతో ప్ర‌సిద్ధి చెందిన‌ది. గురువారం ఇక్క‌డ స్వామి వారికి ప్ర‌త్యేక పూజలు నిర్వ‌హించి, మొక్కులు చెల్లించుకుంటారు. రాఘ‌వేంద్ర స్వామి బృందావ‌నంలోకి ప్ర‌వేశించింది గురువారమే కాబ‌ట్టి.. ఆ రోజు స్వామి వారికి ఎంతో విలువైన‌ది.

రాఘ‌వేంద్ర స్వామి ఎంతో మ‌హిమ‌గ‌ల దేవుడ‌ని అంద‌రి విశ్వాసం. స్వామి వారిని పూజించ‌డం వ‌ల్ల ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. స్వామి వారిని ఏడు వారాల పాటు నియ‌మ‌నిష్ట‌ల‌తో పూజించి, క‌ఠిన ఉప‌వాస దీక్ష‌లు చేయ‌డం ద్వారా మ‌నం అనుకున్న ఎటువంటి కార్య‌క్ర‌మాలు అయినా నెర‌వేరుతాయి. అయితే స్వామి వారిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.

గురువారం తెల్ల‌వారుజామునే మేల్కొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అభ్యంగ స్నాన‌మాచ‌రించి పూజా గ‌దిలోకి ప్ర‌వేశించాలి. పూజా గ‌దిని శుభ్రం చేసుకొని, స్వామి వారిని పూల‌తో అలంక‌రించి పూజించాలి. ఎరుపు రంగులో ఉండే పూల‌తో పూజ చేస్తే స్వామి అనుగ్రహం క‌లుగుతుంది. ప్ర‌తి గురువారం స్వామి వారి మంత్రాన్ని 11 సార్లు ప‌ఠించాలి. ఆరు వారాలు ఇలానే పూజించాలి. ఏడో వారం స్వామి వారిని పూజించే కంటే ముందు వినాయ‌కుడిని పూజించాలి. అనంత‌రం రాఘ‌వేంద్ర స్వామికి తుల‌సి మాల స‌మ‌ర్పించి పూజ ప్రారంభించాలి. చివ‌రి వారం కాబ‌ట్టి.. నైవేద్యంగా బెల్లంతో చేసిన పాయ‌సం నైవేద్యంగా స‌మ‌ర్పించాలి. తుల‌సి ఆకుల‌ను మ‌న చేతిలో పెట్టుకుని స్వామి వారి మంత్రాన్ని ప‌ఠిస్తూ 11 సార్లు ప్ర‌ద‌క్షిణ‌లు చేసిన త‌ర్వాత తుల‌సి ఆకుల‌ను స్వామి వారికి స‌మ‌ర్పించాలి.

ఉప‌వాసం చేసేవారు క‌టిక నేల‌పై నిద్రించాలి..

ఉప‌వాసం చేసేవారు రాత్రి స‌మ‌యాల్లో కేవ‌లం పాలు, పండ్లు మాత్ర‌మే సేవించాలి. ఉప‌వాస దీక్ష చేసేవారు ఎప్పుడూ కూడా మంచం మీద నిద్రించ‌కూడ‌దు. క‌టిక నేల‌పైన ప‌డుకోవ‌డం వ‌ల్ల మ‌నం చేసిన ఏడువారాల వ్ర‌తానికి ఫ‌లితం ల‌భిస్తుంది. ఈ విధంగా ఏడు వారాలు నియ‌మ‌నిష్ట‌ల‌తో స్వామి వారిని పూజించ‌డం వ‌ల్ల మ‌న ఇంట్లో సిరిసంప‌ద‌లకు లోటు ఉండ‌దు. మ‌నం త‌ల‌పెట్టిన ఎటువంటి కార్య‌క్ర‌మాలైన స‌కాలంలో పూర్త‌వుతాయి.