బాలయ్య, నాగార్జునల మధ్య వైరానికి అసలు కారణం ఇదా.!

టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ 90లలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. అన్ని జానర్స్‌లో చిత్రాలు చేసి ప్రేక్షకులకి పసందైన వినోదం పంచారు. అయితే ఈ నలుగురు హీరోలలో చిరంజీవి, నాగార్జున ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటారు. మిగతా హీరోలు అప్పుడప్పుడు కలిసి కనిపిస్తుంటారు. అయితే బాలయ్య, నాగార్జునకి మాత్రం కొన్నేళ్లుగా మాటలు లేవు. ఎందుకు బాలకృష్ణ, నాగార్జునకి చెడింది అనే విషయంపై కూడా కొన్నాళ్లుగా చర్చ నడుస్తున్నా కూడా దానిపై క్లారిటీ రావడం లేదు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇద్దరు హీరోల మధ్య గొడవకు కారణం బాలయ్య హీరోగా నటించిన శ్రీమన్నారాయణ సినిమా అని అంటున్నారు.
రవి చావలి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా ఇషాచావ్లా, పార్వతీ మెల్టన్ హీరోయిన్లుగా శ్రీమన్నారయణ తెరకెక్కింది.ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 2012 సంవత్సరం ఆగష్టు 30వ తేదీన ఈ చిత్రం విడుదల కాగా, మూవీ రిలీజ్ అయిన వారం రోజులకి నాగార్జున నటించిన షిరిడి సాయి అనే సినిమా కూడా థియేటర్లలోకి వచ్చింది .ఆ సమయంలో ప్రముఖ థియేటర్ లో ఓ మోస్తరు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న శ్రీమన్నారాయణ సినిమాను తొలగించి.. షిరిడి సాయి సినిమాకు థియేటర్ కేటాయించడంతో వివాదం చెలరేగింది. ఈ విషయం పోలీస్ స్టేషన్‌కి చేరడంతో బాలయ్య.. దర్శకనిర్మాతలపై కూడా ఫైర్ అయ్యారు. ఈ ఘటన వల్ల బాలయ్య నాగ్ మధ్య దూరం పెరిగింది.
ఏఎన్నార్ చనిపోయిన సమయంలో కూడా బాలకృష్ణ ఆయనని చూడడానికి వెళ్లలేదు. నాగార్జునతో ఏర్పడిన గొడవ వల్లనే బాలకృష్ణ..ఏఎన్నార్ చివరి చూపు చూడడానికి వెళ్లలేదనే టాక్ కూడా నడిచింది. ఇప్పటికీ బాలయ్య, నాగార్జున మధ్య విబేధాలు తారాస్థాయిలోనే ఉన్నట్టు అర్ధమవుతుంది. ఆ మధ్య ఓ ఈవెంట్‌లో బాలయ్య ..అక్కినేని తొక్కినేని అని షాకింగ్ కామెంట్స్ చేయడం పెద్ద వివాదస్పదమే అయింది. అయితే ఆ తర్వాత బాలయ్య క్లారిటీతో వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు బాలకృష్ణ, నాగార్జున సినిమాలలో నటిస్తూనే హోస్ట్‌గాను అదరగొడుతున్నారు.