రాజమౌళిని ఢీకొట్టే దర్శకులు ఎవరు.. వీరిలో ఆ సత్తా ఉందా?

ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి గురించి ప్రపంచానికి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్టూడెంట్ నెం1 సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలు పెట్టిన జక్కన్న అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. బాహుబలి సినిమాతో రాజమౌళి క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత పెరిగింది. ఈ సినిమాలోని పాటకి ఏకంగా ఆస్కార్ అవార్డ్ కూడా రావడం అందరిని ఆశ్చర్యపరచింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో బడా ప్రాజెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.ఈ సినిమాని కనివినీ ఎరుగని స్థాయిలో రూపొందిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్టు సమాచారం.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో టాప్ డైరెక్టర్ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఇప్పుడు ఆయనకి పోటీ ఇచ్చే దర్శకుడు ఎవరు అనేదానిమీద ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. రాజమౌళికి పోటీ ఇచ్చే డైరెక్టర్లలో శంకర్, ప్రశాంత్ నీల్ లు ముందు వరుసలో ఉన్నారు.వీళ్లిద్దరూ కూడా తమదైన రీతిలో సినిమాలు చేసే సత్తా ఉంది. కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ తన సత్తా ఏంటో చూపించాడు. ఇక శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడో ఆయన అద్భుతమైన సినిమాలు చేసి అదరహో అనిపించాడు. ఇప్పుడు ఆయన గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండింటితో విధ్వంసం సృష్టించడం ఖాయమని చెబుతున్నారు.
యానిమల్ ఫేం సందీప్ రెడ్డి వంగా కూడా రాజమౌళి రికార్డ్ ని బ్రేక్ చేసే సత్తా అయితే ఉంది. రాజమౌళి తో పోటీపడి తన సినిమాను సక్సెస్ చేసుకునే సత్తా సందీప్‌కి ఉండగా, ఇటీవల యానిమల్‌తో నిరూపించి చూపించాడు. ఈ మూవీ దాదాపు 900 కోట్ల కు పైన కలక్షన్స్ ని రాబట్టి ఒక భారీ సక్సెస్ ని అందుకుంది ఇక దాంతో సందీప్ రెడ్డి వంగ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారు మ్రోగిపోయింది. రానున్న రోజులలో ఈ ముగ్గురు దర్శకుల నుండి మరిన్ని భారీ సినిమాలు వస్తాయని వాటితో రాజమౌళి రికార్డ్‌ని తిరగరాస్తారని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.