గురువారం ఏ దేవుళ్ల‌ను పూజిస్తే మంచిది..? నలుపు రంగు దుస్తులు ధ‌రించొచ్చా..?

వారంలోని ఏడు రోజుల్లో ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే మంచిదో తెలుసుకుని పూజ‌లు నిర్వ‌హిస్తే చ‌క్క‌ని ఫ‌లితాలు ఉంటాయ‌ని, ఆ ఇంట్లో సిరిసంప‌ద‌లు తుల‌తూగుతాయ‌ని, చెడు శాశ్వ‌తంగా తొల‌గిపోతోంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌రి గురువారం నాడు ఏ దేవుళ్ల‌ను పూజిస్తే మంచిదో తెలుసుకుందాం.

గురువారం ఏ దేవుళ్ల‌ను పూజిస్తే మంచిది..? నలుపు రంగు దుస్తులు ధ‌రించొచ్చా..?

హిందువులు ప్ర‌తి రోజు ఏదో ఒక దేవుడికి పూజ‌లు చేస్తుంటారు. చాలా మంది ఇంట్లోనే పూజ‌లు చేసుకుంటారు. కొంద‌రు త‌మ స‌మీప ఆల‌యాల‌కు వెళ్లి భ‌క్తితో పూజ‌లు చేస్తుంటారు. అయితే ఇంట్లో పూజ‌లు చేసే వారికి ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలో తెలియ‌దు. ఇక ప్ర‌తి రోజు ఒకే దేవుడిని పూజిస్తుంటారు. దీని వ‌ల్ల పెద్ద‌గా లాభం ఉండ‌దు. వారంలోని ఏడు రోజుల్లో ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే మంచిదో తెలుసుకుని పూజ‌లు నిర్వ‌హిస్తే చ‌క్క‌ని ఫ‌లితాలు ఉంటాయ‌ని, ఆ ఇంట్లో సిరిసంప‌ద‌లు తుల‌తూగుతాయ‌ని, చెడు శాశ్వ‌తంగా తొల‌గిపోతోంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌రి గురువారం నాడు ఏ దేవుళ్ల‌ను పూజిస్తే మంచిదో తెలుసుకుందాం.

గురువారం మహావిష్ణువు, బృహస్పతికి అంకితమైన రోజు. అలాగే, గురువారాల్లో గురు దత్తాత్రేయ, దక్షిణా మూర్తి, రాఘవేంద్ర, సాయిబాబాలను పూజించడం, ఆలయాల్లో ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. ఈ రోజును బృహస్పతి పాలించాడని భక్తులు నమ్ముతారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం వల్ల దాంపత్యంలో శాంతి, సంతోషం లభిస్తాయని, కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయని నమ్ముతారు. విష్ణువు, బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి బోదులో దీపం వెలిగించడం మంచిది. ఈ దేవతలకు నెయ్యి, పాలు, పసుపు పువ్వు, బెల్లం సమర్పించండి. విష్ణువు, బృహస్పతి ఎక్కువగా పసుపు బట్టలు ధరిస్తారు.. కాబట్టి, మీరు ఒకే రంగు దుస్తులు ధరించవచ్చు. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లని దుస్తులు ధరించవద్దని పండితులు సూచిస్తున్నారు.

భ‌క్తులు గురువారం తెల్ల‌వారుజామునే అభ్యంగ స్నాన‌మాచరించి పూజ‌లు చేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఆయా దేవుళ్ల‌కు ఇష్ట‌మైన వ‌స్త్రాలు ధ‌రించి పూజ‌లో పాల్గొనాల‌ని, వారికి ఇష్టమైన నైవేద్యం పెడితే, వారి అనుగ్ర‌హం మ‌న‌కు ఉంటుంద‌ని చెబుతున్నారు. కాబ‌ట్టి పూజ‌లు చేసేట‌ప్పుడు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఉండాల‌ని సూచిస్తున్నారు.