సీఎం రేవంత్‌రెడ్డికి షర్మిల పెళ్లిపిలుపు
ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలిసి, తన కుమారుడి పెళ్లి శుభలేఖను అందించారు.

రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన తాజా కాంగ్రెస్ నేత
కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానం
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్‌లో చేరాక వైఎస్ షర్మిల తొలిసారిగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. సీఎం నివాసానికి వెళ్లిన షర్మిల.. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. తన నివాసానికి వచ్చిన షర్మిలకు శాలువ కప్పి రేవంత్ సన్మానించారు. ఈ సందర్భంగా కొంతసేపు వారిద్దరూ మాటామంతి చేశారు. గతంలో తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్టీపీ నేతగా షర్మిల కొనసాగడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు.
కాంగ్రెస్ హైకమాండ్ జోక్యంతో చివరకు షర్మిల తన వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో షర్మిల తన కుమారుడి పెళ్లికి రేవంత్‌ను ఆహ్వానించేందుకు ఆయనను కలువడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా నిలిచింది.