Balapur Ganesh Laddu| కొత్త రికార్డు కొట్టిన బాలపూర్ గణేష్ లడ్డూ వేలం పాట

విధాత, హైదరాబాద్ : బాలపూర్ గణేష్ లడ్డూ(Balapur Ganesh Laddu)వేలం పాట ((New, Record) నమోదు చేసింది. గత ఏడాది రూ.30.01లక్షలు పలికిన బాలపూర్ గణేష్ లడ్డూ ఈ ఏడాది రూ.35లక్షల ధర పలికింది. 1994లో కొలను మోహన్ రెడ్డి రూ. 450కి దక్కించుకున్నాడు. 32సంవత్సరాలుగా లడ్డూ ధర పెరుగుతూ వస్తుంది. ఈ ఏడాది వేలం పాటలో లడ్డూ ధర రూ.5లక్షలు పెరిగి గత రికార్డును బద్దలు కొట్టింది. వేలం పాటలో కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల ధశరథ్ గౌడ్ రూ.35లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ దఫా వేలం పాటలో 38మంది పాల్గొన్నారు.
ఈ ఏడాది మాదాపూర్ మై హోమ్ భూజా వినాయక లడ్డూను రూ.51,07,777లకు గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత గణేష్ ఇల్లందు సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాక గణేష్ లడ్డూ అత్యధిక వేలం పాట బండ్లగూడ జాగీర్ లోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో గణేష్ లడ్డూ పేరిట ఉంది. ఇక్కడ లడ్డూ ఈ ఏడాది ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది. గత ఏడాది 1కోటీ 87లక్షలకు అమ్ముడుపోయింది.