Air Taxi | త్వరలోనే అందుబాటులోకి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు..!

Air Taxi | ఇంకో రెండేళ్లలో అంటే 2026 నాటికి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, అమెరికాకు చెందిన ఆర్చర్‌ ఏవియేషన్‌ సంయుక్తంగా దేశంలో ఎయిర్‌ ట్యాక్సీ (Air taxi) సేవలను ప్రారంభించబోతున్నాయి. అందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ మేరకు ఆ రెండు సంస్థలు గత ఏడాది అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Air Taxi | త్వరలోనే అందుబాటులోకి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు..!

Air Taxi : ఇంకో రెండేళ్లలో అంటే 2026 నాటికి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, అమెరికాకు చెందిన ఆర్చర్‌ ఏవియేషన్‌ సంయుక్తంగా దేశంలో ఎయిర్‌ ట్యాక్సీ (Air taxi) సేవలను ప్రారంభించబోతున్నాయి. అందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ మేరకు ఆ రెండు సంస్థలు గత ఏడాది అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా ఆర్చర్‌ ఏవియేషన్‌ 200 ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (eVTOL) ఎయిర్‌క్రాఫ్ట్‌లను సరఫరా చేయనుంది. ఈ ఎయిర్‌ ట్యాక్సీల్లో పైలట్‌తోపాటు నలుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. హెలికాప్టర్‌ మాదిరిగానే ఇది కూడా పనిచేస్తుంది. అయితే వీటి నుంచి శబ్దం అతి తక్కువగా వస్తుంట. ఈ 200 ఎయిర్‌ ట్యాక్సీల ఖరీదు సుమారు 1 బిలియన్‌ డాలర్లు ఉంటుందట.

తొలి దశలో ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరులో కూడా ఈ సేవలను ప్రారంభించాలని ఇండిగో భావిస్తున్నది. అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి వచ్చే ఏడాదికి సర్టిఫికేషన్‌ పొందే అవకాశం ఉందని, ఆపై డీజీసీఏ సర్టిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆర్చర్‌ ఏవియేషన్‌ వస్థాపకుడు, సీఈఓ ఆడం గోల్డ్‌ స్టెయిన్‌ వెల్లడించారు.

ఎయిర్‌ ట్యాక్సీలో.. ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ నుంచి హర్యానాలోని గురుగ్రామ్‌కు 27 కిలోమీటర్ల దూరం కేవలం ఏడు నిమిషాల్లోనే చేరుకోవచ్చని ఆర్చర్‌ ఏవియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. అందుకు రూ.2 నుంచి 3 వేలు ఖర్చవుతుందన్నారు. అదే దూరానికి కారు ట్యాక్సీలో అయితే సుమారు 90 నిమిషాలు పడుతుందని, అందుకు ఖర్చు రూ.1500 అవుతుందని చెప్పారు.

ఈ విమానంలో ఆరు బ్యాటరీలు ఉంటాయని, 30 నుంచి 40 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్‌ చేయొచ్చని పేర్కొన్నారు. ఒక నిమిషం ఛార్జింగ్‌తో ఒక నిమిషం పాటు ప్రయాణించవచ్చని తెలిపారు.