Ampere Nexus | గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఈ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (Greaves Electric Mobility Pvt Ltd).. తన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ (e-scooter) యాంపీర్ నెక్సస్ (Ampere Nexus) ను ఆవిష్కరించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.09 లక్షలు.
Ampere Nexus : గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఈ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (Greaves Electric Mobility Pvt Ltd).. తన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ (e-scooter) యాంపీర్ నెక్సస్ (Ampere Nexus) ను ఆవిష్కరించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.09 లక్షలు. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో కే విజయ్ కుమార్ చెన్నైలో ఈ విద్యుత్ స్కూటర్‌ను లాంఛనంగా లాంచ్ చేశారు.
చెన్నై నగరంలోని 11 విక్రయ కేంద్రాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తమిళనాడు రాణిపేట్‌లోని కంపెనీ ఫ్యాక్టరీలో యాంపీర్ నెక్సస్ల డిజైన్, అభివృద్ధి జరిగిందని చెప్పారు. 30 శాతం అదనపు బ్యాటరీ లైఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతమని వెల్లడించారు. జన్స్కార్ ఆక్వా, ఇండియన్ రెడ్, లునార్ వైట్, స్టీల్ గ్రే రంగుల్లో ఇవి లభ్యమవుతున్నాయని తెలిపారు.