భారత్‌లోకి మార్కెట్‌లోకి తైవా‌న్‌ కంపెనీ..! ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేయబోతున్న గొగొరో..

ఇప్పుడిప్పుడే దేశంలో ఎలక్ట్రానిక్‌ వాహనాల వినియోగం పెరుగుతున్నది. దీంతో దిగ్గజ ఆటో మొబైల్‌ కంపెనీలన్నీ ఈవీలపై దృష్టిపెడుతున్నాయి

భారత్‌లోకి మార్కెట్‌లోకి తైవా‌న్‌ కంపెనీ..! ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేయబోతున్న గొగొరో..

విధాత‌: ఇప్పుడిప్పుడే దేశంలో ఎలక్ట్రానిక్‌ వాహనాల వినియోగం పెరుగుతున్నది. దీంతో దిగ్గజ ఆటో మొబైల్‌ కంపెనీలన్నీ ఈవీలపై దృష్టిపెడుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తైవాన్‌కు చెందిన గొగొరో కంపెనీ సైతం భారత్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేయబోతున్నది. కంపెనీ స్కూటర్‌కు గొగొరో క్రాస్‌ ఓవర్‌ ఈవీ పేరు పెట్టింది. ఈ ఏడాది డిసెంబర్‌లోనే స్కూటర్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఫీచర్‌, ధర ఎలా ఉండబోతుందో ఆ వివరాలు మీ కోసం..


మొదలైన మ్యానుఫ్యాక్చరింగ్‌


మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో గొగొరో కంపెనీ ఫ్లాంట్‌ను ఏర్పాటు చేసి ఇందులో క్రాస్‌ ఓవర్‌ ఈవీ స్కూటర్‌ను మ్యానుఫ్యాక్చరింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తున్నది. మొదట బీ2బీ పార్ట్​నర్స్​కి ఉత్పత్తిని సరఫరా చేయనున్నది. అయితే, వచ్చే ఏడాది అంటే 2024 తొలి త్రైమాసికంలో డెలివరీలు మొదలయ్యే ఛాన్స్ ఉన్నది. అయితే, క్రాస్​ఓవర్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో టూ వీలర్​ ‘ఎస్​యూవీ’గా గుర్తింపు పొందింది. యుటిలిటీ, అడాప్టెబులిటీని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్​ని తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది.


కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఎలాంగేటెడ్​ ఎల్​ఈడీ హెడ్​లైట్​, ష్రౌడ్​ ఉంటాయి. 12 ఇంచ్​ వీల్స్​ వస్తుండగా.. ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్స్​ ఉంటాయి. రెండు వీల్స్‌కు డిస్క్​ బ్రేక్స్​ ఉండడం విశేషం. కొత్త ఈవీ కర్బ్‌ కర్బ్‌ వెయిట్‌ 126 కేజీలు ఉంటుంది. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ వచ్చే 142 ఎంఎం కాగా.. వీల్‌బేస్‌ 1,400 ఎంఎం. ఇక స్కూటర్​లోని ప్యాసింజర్​ సీట్​ని ఫోల్డ్​ చేసుకొని వీలున్నది. పూర్తిగా తీసివేసే సౌలభ్యం సైతం ఉన్నది. ఫ్రెంట్​, రేర్​ లగేజ్​ ర్యాక్స్​, టాప్​ కేసెస్​ వంటి ఎక్స్​ట్రా యాక్ససరీస్​ని కూడా ఇచ్చే అవకాశాలున్నాయి.


వంద కిలోమీటర్ల రేంజ్‌


ఈ స్కూటర్​లో 1.6 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో వస్తుందని టాక్‌. ఇదే నిజమైతే మోడల్​ రేంజ్​ దాదాపు 100 కిలోమీటర్లుగా ఉండబోతున్నది. భారత్‌ మార్కెట్‌లోకి విస్తరించేందుకు కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో 1.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి సిద్ధమంది. స్విగ్గీ, జొమాటోటో కంపెనీ పార్ట్‌నర్‌షిప్‌ను ఏర్పాటు చేసుకున్నంది. ఢిల్లీ- ఎన్​సీఆర్​లో బ్యాటరీ స్వాపింగ్​ స్టేషన్స్​ని కూడా గొగొరో ఏర్పాటు చేయబోతున్నది. 2024 మధ్య నాటికి ఫుల్​-స్కేల్​ బ్యాటరీ ప్రొడక్షన్​ని చేపట్టాలని నిర్ణయించింది. అయితే, క్రాస్‌ ఓవర్‌ స్కూటర్‌ ఫీచర్స్‌, ధర తదితర వివరాలు తెలియరాలేదు. రాబోయే రోజుల్లో కంపెనీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నది.