Gold purity | బంగారం కొనుగోలు చేస్తున్నారా.. మోసపోవద్దంటే ఇవి తెలుసుకోండి..!

Gold purity | దేశంలో భారీగా బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. గోల్డ్ అనేది ఒక పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా మారింది. పెళ్లిళ్లుగానీ, మరే ఇతర శుభకార్యాలు బంగారం లేకుండా జరిగే పరిస్థితే లేదు. బ్యాంకులు, నగల దుకాణాలు, ఆథరైజ్డ్ డీలర్ల నుంచి బంగారు ఆభరణాలు, నాణేలు, గోల్డ్‌ బార్లను కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ, దంతేరాస్‌ లాంటి పర్వదినాల్లో బంగారాన్ని ఇంకా ఎక్కువగా కొంటుంటారు.

Gold purity | బంగారం కొనుగోలు చేస్తున్నారా.. మోసపోవద్దంటే ఇవి తెలుసుకోండి..!

Gold purity : దేశంలో భారీగా బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. గోల్డ్ అనేది ఒక పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా మారింది. పెళ్లిళ్లుగానీ, మరే ఇతర శుభకార్యాలు బంగారం లేకుండా జరిగే పరిస్థితే లేదు. బ్యాంకులు, నగల దుకాణాలు, ఆథరైజ్డ్ డీలర్ల నుంచి బంగారు ఆభరణాలు, నాణేలు, గోల్డ్‌ బార్లను కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ, దంతేరాస్‌ లాంటి పర్వదినాల్లో బంగారాన్ని ఇంకా ఎక్కువగా కొంటుంటారు. ఆ రెండు రోజుల్లో బంగారం కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తుంటారు. అయితే బంగారం కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే మోసపోవాల్సి వస్తుంది. మనం కొనుగోలు చేస్తున్న బంగారం నకిలీదా.. లో క్వాలిటీదా.. లేదంటే స్వచ్ఛమైనదా..? అని తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్యారెట్స్

సాధారణంగా బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. దీనిని kt లేదా k తో సూచిస్తారు. 24-క్యారెట్ బంగారం అత్యంత స్వచ్ఛమైనది. దీంట్లో 99.9 శాతం బంగారం ఉంటుంది. అయితే ఇది చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి నగల తయారీ కోసం దీనికి ఇతర లోహాలను కలుపుతారు. 18k బంగారంలో 18 భాగాలు బంగారం, 6 భాగాలు ఇతర లోహాలు ఉంటాయి. అంటే 18 క్యారెట్‌ బంగారంలో 75 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. అదేవిధంగా 22 క్యారెట్‌ బంగారంలో 99.6 శాతం స్వచ్ఛత ఉంటుంది.

చిట్కాలు

హాల్‌మార్క్

స్వచ్ఛమైన బంగారానికి ISI హాల్‌మార్క్ ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) జారీ చేసిన ఈ చిహ్నం ప్రభుత్వ గుర్తు. ఇది అన్ని బంగారు నగలపై కనిపిస్తుంది. హాల్‌మార్క్ లేకపోతే ఆ బంగారం స్వచ్ఛమైనది కాదని తెలుసుకోవాలి.

వెనిగర్ టెస్ట్

బంగారం కొనుగోలు చేసేటప్పుడు దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. వెనిగర్ టెస్ట్ ద్వారా గోల్డ్ ప్యూరిటీని ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా బంగారంపై కొన్ని చుక్కల వెనిగర్ పోయాలి. రంగు మారితే బంగారం స్వచ్ఛమైనది కాదని అర్థం చేసుకోవాలి. రంగు మారకపోతే అది స్వచ్ఛమైన బంగారం.

యాసిడ్ టెస్ట్

ఈ పరీక్ష బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడానికి అత్యంత నమ్మకమైన పద్ధతులలో ఒకటి. ఈ టెస్ట్ చేయడానికి ముందుగా నైట్రిక్ యాసిడ్‌తోపాటు ఒక రాయిని తీసుకోవాలి. బంగారాన్ని రాయిపై రుద్దాలి. దానిపై నైట్రిక్ యాసిడ్ పోయాలి. బంగారం తప్ప మరేదైనా లోహం ఉంటే యాసిడ్‌ దానిని కరిగిస్తుంది.

తేలియాడే పరీక్ష

బంగారం నీటిపై తేలియాడదు. ఎందుకంటే దాని పరమాణువులు ఒకదానితో ఒకటి అతుక్కుని సాంద్రతను పెంచుతాయి. అయితే ఏదైనా ఇతర లోహం కలిపితే బంగారం తేలియాడుతుంది.

అయస్కాంత పరీక్ష

బంగారాన్ని అయస్కాంతానికి దగ్గరగా ఉంచాలి. బంగారం అయస్కాంతానికి అతుక్కుంటే అది ప్యూర్ గోల్డ్ కాదని అర్థం. అందులో మెటల్స్ బాగా కలిశాయని లేదా అది లో క్వాలిటీ గోల్డ్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్వచ్ఛమైన బంగారం అయస్కాంతానికి అతుక్కోదు. మ్యాగ్నెట్ దగ్గర పెట్టినా పుత్తడి కొంచెం కూడా రియాక్ట్ కాదు.