అదానీ గ్రూప్ స్టాక్స్‌కు గ్రహణం పట్టింది

విధాత‌:అదానీ గ్రూప్ స్టాక్స్‌కు గ్రహణం పట్టింది. మూడు విదేశీ ఖాతాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డిఎల్) సంస్థ ఫ్రీజ్‌ చేయడంతో అదానీ షేర్లు బాగా నష్టపోయాయి. దీంతో తిరిగి మళ్లీ లాభాల బాట పట్టేందుకు అదానీ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అదానీ గ్రూప్ సీఎఫ్‌ఓ జుగేషిందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. అదానీ భవిష్యత్‌ కార్య చరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి 2-3 సంవత్సరాల ఓల్డ్‌ కంపెనీలు. 5-7 సంవత్సరాల తరువాత లాభాల్ని గడిస్తాయి. […]

అదానీ గ్రూప్ స్టాక్స్‌కు గ్రహణం పట్టింది

విధాత‌:అదానీ గ్రూప్ స్టాక్స్‌కు గ్రహణం పట్టింది. మూడు విదేశీ ఖాతాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డిఎల్) సంస్థ ఫ్రీజ్‌ చేయడంతో అదానీ షేర్లు బాగా నష్టపోయాయి. దీంతో తిరిగి మళ్లీ లాభాల బాట పట్టేందుకు అదానీ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అదానీ గ్రూప్ సీఎఫ్‌ఓ జుగేషిందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. అదానీ భవిష్యత్‌ కార్య చరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవి 2-3 సంవత్సరాల ఓల్డ్‌ కంపెనీలు. 5-7 సంవత్సరాల తరువాత లాభాల్ని గడిస్తాయి. మాది వేగంగా అభివృద్ది చెందుతున్న సంస్థ.

నష్టపోయిన షేర్ల వ్యాల్యూ పెరుగుతుంది. ప్రస్తుతం యుటిలిటీ ప్లాట్‌ఫామ్ సేవల్ని మాత్రమే అందిస్తున్నాం. కానీ మనదేశంలో యుటిలిటీ ఇండెక్స్ లేదు.

అదానీకి డైవర్సిఫైడ్ రిజిస్టర్ ఉంది. దానిపై పనిచేస్తున్నాం.

సిటీ గ్యాస్ చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇది బి-టు-సి వ్యాపారం. ఇది 2టైర్ , 3 టైర్ కేటగిరీ పట్టణాలకు కూడా విస్తరిస్తుంది. ప్రస్తుతానికి దానిపైనే దృష్టి సారించినట్లు అదానీ సీఎఫ్‌ఓ చెప్పారు.

కాగా ఎన్‌ఎస్‌డీఎల్ మూడు విదేశీ ఖాతాలను స్తంభింపజేయడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం 5శాతం – 25 శాతానికి పడిపోయాయి. దాదాపు ఒక దశాబ్దంలో అదానీ ఎంటర్ప్రైజెస్ 25 శాతం పడిపోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అగ్రస్థానంలో ఉన్నాయి. ఇవి కూడా 19 శాతం పైగా కుప్పకూలింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం అదానీ నికర విలువ 7.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 55,000 కోట్లు) నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.