Flipkart Big Diwali Sales | ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్స్ షురూ.. మోటో మొబైల్స్ భారీగా డిస్కౌంట్..!
Flipkart Big Diwali Sales | ఈ కామర్స్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ మొదలయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి సేల్స్ ఇప్పటికే షురూ కాగా.. రేపటి నుంచి అందరికీ అందుబాటులోకి రానున్నది. ప్రత్యేక సేల్‌లో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, యాక్సెసరీస్‌పై భారీ డిస్కౌంట్ లభించనుంది.

Flipkart Big Diwali Sales | ఈ కామర్స్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ మొదలయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి సేల్స్ ఇప్పటికే షురూ కాగా.. రేపటి నుంచి అందరికీ అందుబాటులోకి రానున్నది. ప్రత్యేక సేల్‌లో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, యాక్సెసరీస్‌పై భారీ డిస్కౌంట్ లభించనుంది. మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నది. మోటరోలా కంపెనీకి చెందిన మోటో జీ45 5జీ మార్కెట్ ధర రూ.10,999 కాగా.. దివాళీ సేల్‌లో రూ.9,999 లభించనున్నది. ఈ మొబైల్‌లో 50 మెగాపిక్సల్ కెమెరా, భారీ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉన్నది. ఇక మరో మోటో జీ04ఎస్ మొబైల్ ధరను రూ.7,499 కాగా.. సేల్‌లో రూ.6,999 లభ్యం కానున్నది. ఇందులో డాల్బీ అట్మాస్ ఫీచర్‌తో పాటు 50 మెగాపిక్సల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నది. ఇక మరో మోడల్ మోటో జీ64 5జీ మొబైల్ ధర రూ.16,999 ఉండగా.. రూ.2వేలు తగ్గి రూ.14,999కి అందుబాటులో ఉండనున్నది.
అలాగే, ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్ లభించనున్నది. ఇదే సిరీస్‌లో మరో మోడల్‌లో మోటో జీ85 5జీ రూ.17,999 ధర.. ఈ సేల్‌లో రూ.1000 తగ్గింపుతో రూ.16,999 లభించనున్నది. క్రెడిట్‌కార్డులపై మరో వెయ్యి వరకు డిస్కౌంట్ లభించనున్నది. అలాగే, మోటోరోలా ఎడ్జ్ 50 నియో రూ.23,999 ఉండగా.. బ్యాంక్ ఆఫర్‌తో రూ.22,999కే అందుబాటులో ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో పాటు మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇదే సిరీస్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, మోటరోలా ఎడ్జ్ 50 ప్రొ ఫోన్లపై రూ.2వేల తగ్గింపు దొరకనున్నది. మోటరోలా ఎడ్జ్50 ప్రొ రూ.35,999 ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.29,999కే అందుబాటులో ఉండనున్నది. కొన్ని బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2వేల వరకు డిస్కౌంట్ తగ్గనున్నది. దాంతో రూ.27,999 ఈ ఫోన్ సొంతం చేసుకునే అవకాశం దక్కనున్నది.