Gold-Silver Rates | కొనులుదారులకు ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గి రూ.66,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.220 పతనమై రూ.72,330 పలుకుతున్నది.
Gold-Silver Rates | కొనులుదారులకు ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గి రూ.66,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.220 పతనమై రూ.72,330 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,980కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,300 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,330కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,480కి దిగివచ్చింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.66,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,330 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం నిలకడగా కొనసాగుతున్నది. ఢిల్లీలో కిలో వెండి రూ.91వేలు ఉండగా.. రూ.95,600 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.