పసిడి మెరుపులు..! మళ్లీ భారీగా పెరిగిన ధర..! హైదరాబాద్‌లో రూ.58వేలకు..!

విధాత: మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడోరోజు పుత్తడి ధరలు పెరిగాయి. అయితే, బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే సమయమని, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. సోమవారం మార్కెట్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.400 పెరిగి తులం రూ.53,150 పలుకుతున్నది.
ఇక 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.440 పెరిగి.. తులం రూ.57,980కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లోనూ పసిడి ధరలను పరిశీలిస్తే ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.53,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,130కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.53,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.57,980కి చేరింది.
బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి రూ.53,150 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.57,980కి ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.53,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.58,850కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పుత్తడి రూ.53,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.57,980 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలోకు రూ.75వేల వద్ద కొనసాగుతున్నది. అలాగే ప్లాటినం ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. తులం ప్లాటినం రూ.23,430 వద్ద ట్రేడవుతున్నది.