స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బులియన్ మార్కెట్ లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ.1,53,540కి పడిపోయింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,40,740కి చేరింది. కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ.2,69,900 వద్ద నిలిచింది.
విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు వరుస హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. బులియన్ మార్కెట్ లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ.1,53,540కి పడిపోయింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,40,740కి చేరింది. కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ.2,69,900 వద్ద నిలిచింది.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బంగారం, వెండి ధరలు అనూహ్య హెచ్చుతగ్గులను నమోదు చేస్తున్నాయి. ధరలు అస్థిరత దశను దాటితే భవిష్యత్తులో తులం బంగారం ధర రూ.1,63,000 రూపాయల దిశగా దూసుకుపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా ఉండటం, ధరల స్థాయి అనుకూలంగా ఉండటంతో పెట్టుబడిదారులు దీన్ని ఒక కొనుగోలు అవకాశంగా పరిగణించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ధరల వద్ద కొద్దికొద్దిగా కొనుగోలు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వెండి ధరలు క్రమంగా పుంజుకుని మునుముందు మళ్లీ రూ. 2,80,000 రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram