HDFC Credit Card Rules | మీకు హెచ్డీఎఫ్సీ కార్డు ఉందా..? క్రెడిట్ కార్డు ఈ నిబంధనలు మారాయాని తెలుసా?
HDFC Credit Card Rules | హెడ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనల్లో బ్యాంకు కీలక మార్పులు చేసింది. మారిన రూల్స్ ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి రాబోతున్నాయి. క్రెడిట్‌కార్డు రెంటల్ పేమెంట్స్ విషయంలో నిబంధనలను మార్చింది.

HDFC Credit Card Rules | హెడ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనల్లో బ్యాంకు కీలక మార్పులు చేసింది. మారిన రూల్స్ ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి రాబోతున్నాయి. క్రెడిట్‌కార్డు రెంటల్ పేమెంట్స్ విషయంలో నిబంధనలను మార్చింది. చాలామంది క్రెడిట్‌కార్డులను ఉపయోగించి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా రెంట్పేమెంట్స్ చేస్తుంటారు. పేటీఎం, క్రెడ్, మొబిక్విక్‌తో పాటు పలు యాప్స్‌ని వినియోగించి రెంటల్ ట్రాన్సాక్షన్స్ చేసే విషయం తెలిసిందే. ఈ తరహా లావాదేవీలపై ఒకశాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు వెల్లడించింది. థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులతో పాటు, రివార్డ్‌లను రీడిమ్ చేయడం, విద్యాపరమైన లావాదేవీలపై ప్రత్యేక ఛార్జిలను విధించబోతున్నది. ఈ రూల్స్ ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. దాంతో పాటు రూ.50వేలలోపు చేసే ట్రాన్సాక్షన్స్‌పై ఎలాంటి అదనపు ఫీజులు ఉండవని పేర్కొంది. కానీ, రూ.50వేలపైన జరిపే లావాదేవీలన్నింటిపై ఒకశాతం వరకు ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుందని తెలిపింది.
అయితే ఈ ట్రాన్సాక్షన్ ఫీజు గరిష్ఠంగా రూ.3వేల వరకు ఉంటుంది. ఇన్సూరెన్స్‌కి సంంధించిన లావాదేవీలపై ఛార్జీల మినహాయింపును ఇచ్చింది. క్రెడిట్ కార్డు ఉపయోగించి పెట్రోల్, డీజిల్ లావాదేవీలు చేసినట్లయితే లావాదేవీల్లో రూ.15వేలు దాటితే ఒక శాతం వరకు అదనంగా ఫీజు చెల్లించాల్సి రానున్నది. అయితే ఈ ట్రాన్సాక్షన్ అనేది గరిష్ఠంగా రూ.3వేల వరకు విధించారు. క్రెడిట్ కార్డు ఉపయోగించి ఎడ్యుకేషనల్ ట్రాన్సాక్షన్స్ జరిపితే సైతం ఒక శాతం వరకు ఫీజు వసూలు చేయనున్నారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పేమెంట్లకు మాత్రం కాస్త మినహాయింపును ఇచ్చారు. పీఓఎస్ మెషిన్ల ద్వారా స్కూల్, కాలేజీ ఫీజులు చెల్లించినట్లయితే ఈ ట్రాన్సాక్షన్‌పై ఫీజు ఉండనున్నది. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపితే మాత్రం చార్జీలు వసూలు చేయనున్నారు. ఇంటర్నేషనల్ కరెన్సీ చార్జీలపై కూడా 3.5శాతం వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. మరిన్ని వివరాలకు బ్యాంకు వెబ్సైట్లో సంప్రదించాలని సూచించింది.