JSW: సౌండ్ ఆఫ్ కలర్.. క్యాంపెయిన్ ప్రారంభం

ముంబై: 24 బిలియన్ డాలర్ల జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన,పెయింట్స్ దిగ్గజాల్లో ఒకటైన జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్, ‘సౌండ్ ఆఫ్ కలర్’ క్యాంపెయిన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇది ధ్వనికి ప్రేరణగా నిల్చే వర్ణాలను ప్రతిఫలించేలా, సంగీతం, విజువల్ స్టోరీటెల్లింగ్ మేళవింపుగా ఉంటుంది. భారతదేశపు ఇండిపెండెంట్ ఆర్టిస్టుల అగ్రగామి ప్లాట్‌ఫాం సాంగ్డ్యూ (Songdew) భాగస్వామ్యంతో ఈ ప్రయోగాత్మకమైన క్యాంపెయిన్ తొలిసారిగా ఆవిష్కరించారు. ఇందులో వన్ మినిట్ మ్యూజిక్ వీడియోలు ఉంటాయి. జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్ పోర్ట్‌ఫోలియోలోని నిర్దిష్ట వర్ణాల భావాన్ని వివరించే విధంగా ఒక్కో ట్రాక్ ఉంటుంది. ‘సౌండ్ ఆఫ్ కలర్’ క్యాంపెయిన్‌లో ఒక్కో ట్రాక్, నిర్దిష్ట వర్ణపు భావోద్వేగాలను తలపించేలా సమకాలీన ఇండిపెండెంట్ ఆర్టిస్టులు తీర్చిదిద్దారు. ప్రముఖ ఇండిపెండెంట్ ఆర్టిస్టులైన కబీర్ కేఫ్, ఈపీఆర్ అయ్యర్, మాధుర్ శర్మ, రఘు దీక్షిత్ ఈ ట్రాక్‌లను కంపోజ్ చేశారు. వివిధ మానసిక స్థితులను, భావోద్వేగాలను ప్రతిబింబించే వర్ణాలతో ఈ మ్యూజిక్ వీడియోలు ఆకట్టుకునే విధంగా రూపొందించారు.
“రంగులను అనుభూతి చెందడానికి సంబంధించి సౌండ్ ఆఫ్ కలర్ అనేది ఒక తాజా, సృజనాత్మకమైన దృష్టి కోణంగా ఉంటుంది. సంగీతం ద్వారా రంగులను అనుభూతి చెందే విధంగా ఉంటుంది. సాంగ్డ్యూ ఆర్టిస్టులతో జట్టుకట్టడం ద్వారా ఈ కాన్సెప్టునకు ఒక విశిష్టమైన దృష్టికోణాన్ని జోడించినట్లయింది. వర్ణాలతో మనం కనెక్ట్ అయ్యే విధానాన్ని పునర్నిర్వచించాలనేది, రంగులను ఎంచుకోవడాన్ని ఒక భావోద్వేగభరితమైన అనుభూతిగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. ఈ క్యాంపెయిన్ బహుళ డిజిటల్ ప్లాట్‌ఫాంలపై విడుదల చేస్తాం” అని జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్ జాయింట్ ఎండీ, సీఈవో ఎ.ఎస్.సుందరేశన్ తెలిపారు. స్వతంత్ర సంగీతకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు, మరింత మందికి చేరువయ్యేందుకు సాంగ్డ్యూ ఒక వేదికగా ఉపయోగపడుతోంది. “మన భావోద్వేగాలపై, సృజనాత్మకతపై సంగీతం, వర్ణాలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఈ విశిష్టమైన కార్యక్రమం కోసం జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌తో జట్టు కట్టడం మాకెంతో సంతోషకరమైన విషయం. ప్రతిభావంతులైన ఇండిపెండెంట్ ఆర్టిస్టులతో కలిసి పని చేయడం ద్వారా, ప్రజలు సంగీతం, రంగులను అనుభూతి చెందే విషయంలో తాజా దృష్టి కోణాన్ని ఆవిష్కరించాలనేది మా లక్ష్యం” అని సాంగ్డ్యూ వ్యవస్థాపకుడు సునీల్ ఖన్నా తెలిపారు.