మోదీ ప్రకటన ఎఫెక్ట్.. తగ్గిన బంగారం

24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 1,52,130కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ. 1,39,450వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000 పెరిగి రూ. 2,85,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | May 11, 2026, 12:07 pm IST
Read Time: 3 mins
మోదీ ప్రకటన ఎఫెక్ట్.. తగ్గిన బంగారం

మళ్లీ యుద్ధ ఉద్రిక్తతలు రాజుకున్న పరిస్థితులు బంగారం, వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనికి తోడుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమాసియా యుద్దంతో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు భారతీయులు ఏడాది పాటు బంగారం కొనవద్దన్న సూచన కూడా బంగారం ధరలను ప్రభావితం చేసింది. దీంతో దేశీయంగా బులియన్ మార్కెట్ లో సోమవారం బంగారం ధరలు మారిపోయాయి.

24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 1,52,130కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ. 1,39,450వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000 పెరిగి రూ. 2,85,000వద్ద కొనసాగుతుంది.

ఇరాన్ పంపిన శాంతి ఒప్పందం నచ్చలేదంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ద ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. దీంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ తగ్గుదల ఎప్పటివరకు ఉంటుందనేది అర్థంకాని ప్రశ్నలా మిగిలింది. పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.భారత్ లో స్వయంగా ప్రధాని మోదీ ఏడాది పాటు బంగారం కొనవద్దన్న సూచనతో దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతుందన్న ఆందోళన నెలకొనడంతో బంగారం కొనుగోలు మందగించే పరిస్థితి కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

పీఎం కిసాన్ 23వ విడత నిధులు అప్పుడే..?
Ashu Reddy | నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు .. భరత్ కాంత్ మృతిపై అషు రెడ్డి ఎమోష‌న‌ల్ పోస్ట్