Realme C65 5G | భారతదేశ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్‌కు భారీగానే డిమాండ్ ఉన్నది. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కంపెనీలు పలు కొత్త కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తున్నాయి. తాజాగా రియల్మీ కంపెనీ సైతం మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మోడల్‌కు రియల్మీ సీ65 పేరుపెట్టినట్లు తెలుస్తుంది. అయితే, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మొబైల్‌కు సంబంధించి వివరాలు లీక్ అయ్యాయి. ఈ క్రమంలో ఈ మోడల్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ మొబైల్ మోడల్ పేరును సీ65గా నామకరణం చేశారని.. ఇది 6జీబీ ర్యామ్‌తో రానున్నట్లు తెలుస్తున్నది. 91మొబైల్స్ హిందీ నివేదిక ప్రకారం.. ఈ మొబైల్ కేవలం రూ.10వేలలోపు ఉండవచ్చని సమాచారం. అదనంగా 6 జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉండవచ్చని తెలుస్తున్నది.
ఈ మొబైల్‌ను వియత్నాంలో ఏప్రిల్ 4న సీ65 లాంచ్ చేయనున్నది. ప్రస్తుతం ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు హాట్‌టాపిక్‌గా మారింది. సమాచారం మేరకు.. రియల్మీ సీ65లో 6.67 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్‌నెస్‌తో రానున్నది. మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌సెట్‌పై ఆధారపడి పని చేయనుండగా.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనున్నట్లు తెలుస్తున్నది. రియల్మీ సీ65 డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు ఫ్లిక్కర్ సెన్సార్‌ను ఉండే అవకాశం ఉండగా. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఛాన్స్ ఉన్నది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో రానున్నది. వాటర్- డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ పొందినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. రియల్మీ సీ65 గ్లోబల్ లాంచ్ డేట్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. స్పెసిఫికేషన్స్‌పై సైతం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం రూమర్స్ మాత్రమే. ఇప్పటి వరకు సంస్థ ఈ రూమర్స్‌పై స్పందించలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది.