TATA AIA యులిప్ అద్భుత పథకాలు.. బెంచ్‌మార్క్ దాటిన రాబడులు

ముంబయి: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు (యులిప్స్) ప్రమాణాలు నెలకొల్పడం కొనసాగిస్తుంది. మార్కెట్ బెంచ్‌మార్క్‌లు దాటి కంపెనీ ఫండ్‌లు పనిచేశాయి. పాలసీదారులకు దీర్ఘకాలిక వృద్ధి, జీవిత బీమా భద్రత అందించేలా ఇవి సముచిత మేళవింపుగా ఉన్నాయి. బెంచ్‌మార్క్‌లు దాటి ఫండ్ పనితీరు ప్రదర్శిస్తున్న టాటా ఏఐఏకి పెట్టుబడుల ఆధారిత ప్లాన్‌లలో విస్తారమైన అనుభవం ఉంది. కంపెనీ నిర్వహణలో ఉన్న 99.93 శాతం ఆస్తులకు (ఏయూఎం), 5 ఏళ్ల ప్రాతిపదికన, అంతర్జాతీయ గుర్తింపు పొందిన రేటింగ్ ఏజెన్సీ మార్నింగ్‌స్టార్ నుండి 4 లేదా 5 స్టార్ రేటింగ్‌లు దక్కాయి. ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ పరిశ్రమ సగటు కేవలం 29 శాతంగా మాత్రమే ఉంది. పటిష్టమైన జీవిత, ఆరోగ్య బీమా ప్రయోజనాలతో టాటా ఏఐఏ పథకాలు, పాలసీదారులకు అత్యధిక వృద్ధి అవకాశాలు అందిస్తున్నాయి. వివిధ మార్కెట్‌క్యాప్‌లలో రిస్కులు, రాబడుల మధ్య సమతౌల్యం పాటిస్తూ, ఫండ్స్ ప్రధానంగా అత్యంత మెరుగ్గా పనిచేస్తున్న స్టాక్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తాయి.
టాటా ఏఐఏ నాయకత్వం
“టాటా ఏఐఏ లైఫ్ పెట్టుబడుల లక్ష్యాలు సాధించడంలో మేము ఆయా విభాగాల్లో అత్యుత్తమంగా, నిలకడగా, దీర్ఘకాలంలో రిస్కులకు అనుగుణమైన రాబడులు అందించడం లక్ష్యంగా పని చేస్తున్నాం. పటిష్టమైన రీసెర్చ్ మెథడాలజీ ద్వారా స్టాక్స్‌ను ఎంపిక చేయడానికి మేము బాటమ్-అప్ విధానం ఉపయోగిస్తాము. మా పోర్ట్‌ఫోలియో మెరుగైన పనితీరు సాధించడంలో ఈ వ్యూహం తోడ్పడింది” అని టాటా ఏఐఏ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (సీఐవో) హర్షద్ పాటిల్ తెలిపారు. పాలసీదారుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యం. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సమగ్ర యులిప్ పథకాల ద్వారా నిలకడగా, బెంచ్‌మార్క్‌లను మించిన రాబడులు అందిస్తుంది. జీవిత బీమాను పునర్నిర్వచించడంలో అగ్రగామిగా కొనసాగుతుంది. 2025 మే 31 నాటికి టాటా ఏఐఏ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) వార్షికంగా 27.08 శాతం వృద్ధి చెంది రూ. 1,30,053 కోట్లకు చేరింది. వ్యక్తిగత న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం, అసాధారణమైన పెట్టుబడుల పనితీరు దీనికి కారణం.