TVS Jupiter 110 CC Scooter | టీవీఎస్ కొత్త జుపిటర్ 100 అప్‌డేట్ స్కూటర్.. వావ్ అనిపించేలా ఫీచర్స్..!
TVS Jupiter 110 CC Scooter | ప్రముఖ దేశీయ మోటార్ సైకిల్ కంపెనీ టీవీఎస్ ఉత్పత్తులకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నది. ముఖ్యంగా జుపిటర్ 110 స్కూటర్లకు మార్కెట్లలో భారీగా అమ్మకాలు సాగుతుంటాయి. ఇప్పటికే సేల్స్‌లో రికార్డులు సృష్టించింది. కంపెనీ వినియోగదారులకు మరో శుబవార్త చెప్పింది.

TVS Jupiter 110 CC Scooter | ప్రముఖ దేశీయ మోటార్ సైకిల్ కంపెనీ టీవీఎస్ ఉత్పత్తులకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నది. ముఖ్యంగా జుపిటర్ 110 స్కూటర్లకు మార్కెట్లలో భారీగా అమ్మకాలు సాగుతుంటాయి. ఇప్పటికే సేల్స్‌లో రికార్డులు సృష్టించింది. కంపెనీ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. పదేళ్ల తర్వాత తొలిసారిగా జుపిటర్ 110ని అప్‌డేట్ వేరియంట్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మార్కెట్లో హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్, హీరో మాస్ట్రోకి గట్టి పోటీ ఇవ్వనున్నది. కొత్త స్కూటర్ మోడల్, ఫీచర్స్ విషయానికి వస్తే.. 110 జుపిటర్ స్కూటర్ అద్భుతమైన డిజైన్‌తో టీవీఎస్ తీసుకువచ్చింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్ సెటప్ ఉంటుంది.
ఫ్రంట్ సెటప్‌లో ఎల్‌ఈడీ లైట్ బార్ డిజైన్‌తో తీసుకువచ్చింది. ఈ స్కూటర్ బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్స్‌తో అందుబాటులోకి రాగా.. ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు అద్భుతమైన ఫినిషింగ్‌తో వస్తుంది. ఈ స్కూటర్ మిడిల్ రేంజ్ బడ్జెట్‌లో అందుబాటులో అందుబాటులోకి ఉండనున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో బేస్ డ్రమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.73,700తో తీసుకువచ్చింది. సెకండ్ డ్రమ్ అల్లాయ్ వేరియంట్ రూ.79,200కే లభించనున్నది. ఇక చివరి వేరియంట్ డ్రమ్ ఎస్ఎక్స్‌సీ ధర రూ.83,250 అందుబాటులో ఉంటుంది. ఇక స్కూటర్ ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఆటో టర్న్ ఇండికేటర్ రీసెట్‌తో పాటు ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్ ఫీచర్స్ ఉన్నాయి.
ఈ స్కూటర్‌లో ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్ సెటప్‌ను ఉంటుంది. ఈ స్కూటర్‌లో ప్రీమియం ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ ఆప్షన్‌తో పాటు వాయిస్ అసిస్ట్ ఫీచర్స్‌ను సైతం ఉండనున్నట్లు టాక్. జుపిటర్ 2024 స్కూటర్ ప్రీమియం చట్రాలతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు అద్భుతమైన ఇంధన ట్యాంక్, హ్యాండిల్‌బార్స్ ఉంటాయి. 113.5 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ సెటప్ ఉంటుంది. 9.2 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు ఈ స్కూటర్ ఐజీఓ అసిస్ట్ ఫీచర్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ట్యాంక్ వివరాల్లోకి వెళితే, దీని ఇంధన ట్యాంక్ గత స్కూటర్ కంటే 300 ఎంఎల్ చిన్నగా వస్తుంది.