Balagam | ఫిల్మ్​ఫేర్​ నామినేషన్స్​లో ‘బలగం’ హవా..!

తెలుగు సినిమా కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం 'బలగం'. గతేడాది మార్చి 3న విడుదలైన ఈ సినిమా ఎంతటి సృష్టించిందో చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్‌గా నిలిచింది. కమెడియన్​ వేణు దర్శకుడిగా అటువంటి సున్నిత భావోద్వేగ చిత్రం అందించడం సినీ పరిశ్రమనంతటినీ షాక్​కు గురి చేసింది. వేణుకు దిగ్గజాల ప్రశంసలు వెల్లువెత్తాయి.

Balagam |  ఫిల్మ్​ఫేర్​ నామినేషన్స్​లో ‘బలగం’ హవా..!

తెలంగాణ గ్రామీణ(Rural Telangana rituals) సంప్రదాయాల నేపథ్యంలో, లోతైన భావోద్వేగాలను కలగలిపి తీసిన చిత్రం ‘బలగం’(Balagam). ఒక చిన్న సంప్రదాయం కుటుంబంలో రేపిన ఘర్షణలు ఇతివృత్తంగా వేణు (Venu Yeldandi) రాసుకున్న ఈ కథ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపింది. ఊరూరా పెద్ద పెద్ద తెరలు ఏర్పాటు చేసి, సామూహికంగా బలగం సినిమాను వీక్షించడం (Group viewing in villages) చాలా సంవత్సరాల తర్వాత జరిగిన విశేషం.  రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా బలగం మూవీకి మంచి గుర్తింపు లభించింది. తెలంగాణ సంస్కృతి, మూలాల నేపథ్యంలో వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. కలెక్షన్లతో పాటు ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా బలగం మూవీకి గుర్తింపు లభించింది. అయితే తాజాగా ఈ మూవీ ఫిల్మ్‌ఫేర్‌(69th Sobha Filmfare Awards South 2024 ) అవార్డుల నామినేషన్లలోనూ సత్తా చాటింది. సలార్(Salaar)​, దసరా(Dasara)  వంటి పాన్‌ ఇండియా చిత్రాలకు పోటీగా ఈ సినిమా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల బరిలో నిలిచింది. శోభ ఫిల్మ్​ఫేర్​ అవార్డ్స్​ సౌత్​ 2024 అవార్డులకు సంబంధించి ఈ చిత్రం ఏకంగా ఎనిమిది కేటగిరి(BALAGAM nominated in 8 Categories)ల్లో నామినేట్‌ అయ్యింది. ఈ మేరకు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ చిత్రాల నామినేషన్స్​ వివరాలను ఫిల్మ్​ఫేర్​ ప్రకటించింది.

ఈ వివరాల ప్రకారం ఉత్తమ చిత్రం, ఉత్తమ ద‌ర్శకుడు, ఉత్తమ స‌హ‌య నటుడు(కోట జయరాం), ఉత్తమ సంగీతం(భీమ్స్​ సిసిరోలియో), ఉత్తమ గీతం(కాసర్ల శ్యామ్​–ఊరూ పల్లెటూరు), ఉత్తమ స‌హ‌య నటి(రూపలక్ష్మి)తో పాటు ఉత్తమ గాయకుడు(రామ్​ మిరియాల–పొట్టిపిల్లా..), గాయని(మంగ్లీ–ఊరూ పల్లెటూరు)..  ఇలా 8 కేట‌గిరీల్లో బలగం మూవీ నామినేట్ అయ్యింది. ఇక ఈ అవార్డు ఫలితాల‌ను త్వర‌లోనే ఫిల్మ్‌ఫేర్‌ వెల్లడించ‌నుంది. కాగా ఈ సినిమాలో ప్రియదర్శి (Priyadarshi), కావ్య కల్యాణ్‌ రామ్‌(Kavya Kalyanram) హీరోహీరోయిన్లుగా నటించగా.. వేణు యెల్దండి, మురళీధర్ గౌడ్‌, కోట జయరామ్‌, రూపలక్ష్మి, రచ్చ రవి తదితర నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర్‌ క్రియేషన్స్‌పై అగ్ర నిర్మాత ‘దిల్‌’ రాజు(Dil Raju) నిర్మించాడు.

 

ఇక ముఖ్య విభాగాలైన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి కేటగిరీల్లో నామినేట్​ అయిన తెలుగు చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఉత్తమ చిత్రం(BEST FILM) : బేబీ, బలగం, దసరా, హాయ్​..నాన్నా.!, మిస్​ శెట్టి–మిస్టర్​ పొలిశెట్టి, సామజవరగమన, సలార్​ పార్ట్​–1

ఉత్తమ దర్శకుడు(BEST DIRECTOR) : అనిల్​ రావిపూడి(భగవంత్​ కేసరి), కార్తీక్​ దండు(విరూపాక్ష), ప్రశాంత్​ నీల్​( సలార్​ పార్ట్​–1), సాయి రాజేశ్​(బేబీ), శౌర్యువ్​( హాయ్​..నాన్నా.!), శ్రీకాంత్​ ఓదెల(దసరా), వేణు ఎల్దండి(బలగం)

ఉత్తమ నటుడు(BEST ACTOR IN A LEADING ROLE (MALE)): ఆనంద్​ దేవరకొండ(బేబీ), బాలకృష్ణ(భగవంత్​ కేసరి), చిరంజీవి(వాల్తేర్​ వీరయ్య), ధనుష్​(సర్​), నాని(దసరా, హాయ్​..నాన్నా.!,), నవీన్​ పొలిశెట్టి(మిస్​ శెట్టి–మిస్టర్​ పొలిశెట్టి), ప్రకాశ్​రాజ్​(రంగ మార్తాండ)

ఉత్తమ నటి(BEST ACTOR IN A LEADING ROLE (FEMALE)): అనుష్కశెట్టి(మిస్​ శెట్టి–మిస్టర్​ పొలిశెట్టి), కీర్తి సురేశ్​(దసరా), మృణాల్​ ఠాకూర్​( హాయ్​..నాన్నా.!), సమంత(శాకుంతలం), వైష్టవీ చైతన్య(బేబీ)