Actress| బాబోయ్.. ప్ర‌భాస్ హీరోయిన్ గుర్తు ప‌ట్ట‌కుండా ఇలా మారిందేంటి?

Actress| ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలిగిపోతున్న ప్ర‌భాస్ బ్లాక్ బ‌స్టర్ చిత్రాల‌లో బుజ్జిగాడు మూవీ ఒక‌టి. ఈ చిత్రం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో

  • By: sn    cinema    Jun 14, 2024 2:54 PM IST
Actress| బాబోయ్.. ప్ర‌భాస్ హీరోయిన్ గుర్తు ప‌ట్ట‌కుండా ఇలా మారిందేంటి?

Actress| ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలిగిపోతున్న ప్ర‌భాస్ బ్లాక్ బ‌స్టర్ చిత్రాల‌లో బుజ్జిగాడు మూవీ ఒక‌టి. ఈ చిత్రం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ మూవీ అప్ప‌ట్లో భారీ విజ‌యం అందుకుంది. ఇందులో ప్ర‌తి ఒక్కరు కూడా త‌మ ప‌ర్‌ఫార్మెన్స్‌తో అల‌రించారు. ఇక ఇందులో సెకండ్ హీరోయిన్‌గా న‌టించి అల‌రించింది సంజ‌న గ‌ల్రాని. ఈ అమ్మ‌డు కంగన పాత్రలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమా కంటే ముందులో తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా ఫేమస్ కాలేదు. బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సంజ‌న ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో న‌టించి అల‌రించింది.

అందం, అభిన‌యంతో అల‌రిస్తున్నా కూడా ఎందుకో అవ‌కాశాలు అంత‌గా రావ‌డం లేదు. ఇక చేసేదేం లేక పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఆ తర్వాత అనుకోని వివాదంలో ఇరుక్కొని టాక్ ఆఫ్ ది టౌన్‌గా కూడా మారింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు షాకింగ్ లుక్‌లో క‌నిపిస్తూ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. అస‌లు సంజనానేనా ఈమె అని అంద‌రు అవాక్క‌వుతున్నారు. అస‌లు ఎందుకు ఇలా మారింది అని అంద‌రు నోరెళ్ల‌పెడుతున్నారు. ఇక సంజ‌నా 2020 లాక్ డౌన్ సమయంలో బెంగళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని పెళ్లాడింది.ఇక 2022 మే నెలలో సంజనా గల్రాని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన ఈ భామ డ్ర‌గ్స్ కేసు విష‌యంలో కూడా ఇరుక్కుంది. కొన్నాళ్లు జైలుకి కూడా వెళ్లింది. ఇక రీసెంట్‌గా క‌న్న‌డ‌ నటుడు దర్శన్ అరెస్ట్ పై స్పందిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె లుక్ చూసి అంతా షాక్ అవుతున్నారు. దర్శన్ అరెస్ట్ గురించి సంజన మాట్లాడుతూ.. దర్శన్ వార్త చూసి షాక్ అయ్యాను. ఆందోళన కూడా చెందాను. దేవుణ్ణి ప్రార్ధించాను. ఆయనను అరెస్టు చేయకూడదు. ఇది నిజంగా షాకింగ్ న్యూస్. అతన్ని విడుదల చేయాలని కోరుతున్నాను. ఎఫ్‌ఐఆర్‌లో అతని పేరు ఉండకూడదని కోరుకుంటున్నాను అంటూ సంజ‌న వీడియో షేర్ చేసింది. వీడియెలో సంజ‌న న్యూ లుక్ చూసి అంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.