Alia Bhatt|ఆర్ఆర్ఆర్ బ్యూటీ డ్రెస్ అద‌ర‌హో.. ఈ డ్రెస్ కోసం 163 మంది.. 1905 గంటలు పనిచేశారా..!

Alia Bhatt| బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భ‌ట్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మ‌హేష్ భ‌ట్ కూతురిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది. ఇందులో సీత పాత్ర‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అలి

  • By: sn    cinema    May 08, 2024 7:20 AM IST
Alia Bhatt|ఆర్ఆర్ఆర్ బ్యూటీ డ్రెస్ అద‌ర‌హో.. ఈ డ్రెస్ కోసం 163 మంది.. 1905 గంటలు పనిచేశారా..!

Alia Bhatt| బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భ‌ట్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మ‌హేష్ భ‌ట్ కూతురిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది. ఇందులో సీత పాత్ర‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అలియా కొద్ది రోజుల క్రితం ర‌ణ్‌బీర్‌ని వివాహం చేసుకొని ఓ పాప‌కి కూడా జ‌న్మించింది. ప్ర‌స్తుతం త‌న ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతూనే మ‌రోవైపు సినిమాలు, ఈవెంట్స్ అంటూ తెగ సంద‌డి చేస్తుంది. అయితే అలియా రీసెంట్‌గా న్యూయార్క్ లో జరిగే మెట్ గాలా ఈవెంట్ కి వెళ్ళింది. ఈ ఈవెంట్ కి అనేక సినీ పరిశ్రమల నుంచి, బిజినెస్ పరిశ్రమ నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు హాజ‌ర‌య్యారు.

మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో జరిగిన ఈవెంట్ లో అలియా భట్ అదిరిపోయే లుక్‌లో క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. మ‌రోవైపు ఇషా అంబానీ వింత దుస్తులు చూసి విదేశీయులు అవాక్క‌య్యారు. ఈవెంట్‌లో అలియా భ‌ట్ త‌న చీర‌తో సెంట్రాఫ్ అట్రాక్ష‌న్‌గా మారింది. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన రంగు రంగు పువ్వులతో ఉన్నటువంటి చీర కట్టుకోవడం వెనుక చాలా కథ ఉందని తెలుస్తోంది.ఈ కార్యక్రమంలో ఆలియా కట్టిన షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన‌ట్టు స‌మాచారం. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్ కు సరిపోయేలా మన దేశ సంస్కృతిని తెలియ‌జేసేలా ఈ చీర‌ని డిజైన్ చేశార‌ని, దీని కోసం 163 డిజైనర్లు 1965 గంటలు కష్టపడి తయారు చేసిన‌ట్టు టాక్ వినిపిస్తుంది.

చాలా పొడ‌వైన చీర‌లో అలియా భ‌ట్ మెట్ గాలా రెడ్ కార్పెట్ పై హొయలు పోతుంటే అక్క‌డున్న వారంద‌రు కూడా ఈ అమ్మడినే చూస్తూ ఉండిపోయారు.ఆ చీర‌లో అలియాని చూస్తుంటే అలియా ఒక బిడ్డకు తల్లి అని అనుకోవడం కష్టమే. ఇలాంటి ఇంటర్నేషనల్ వేదికలపై చీర‌క‌ట్టుతో మ‌న ఇండియ‌న్స్ మెర‌వ‌డం అనేది మ‌న భారీత‌యుల‌కి గ‌ర్వకార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. ఇప్పటి వ‌ర‌కు ఇంటర్నేష‌న‌ల్ వేదిక‌ల‌పై గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ లాంటి హీరోయిన్లు చీరల్లో మెరిసారు. ఇప్పుడు వారి బాట‌లోనే న‌డిచింది అలియా.