Allu Arjun|ఏపీ హైకోర్టులో పిటీష‌న్ వేసిన అల్లు అర్జున్.. కార‌ణం ఏంటంటే..!

Allu Arjun| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మ‌ధ్య తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం చేయ‌డానికి ప‌వ‌న్ కోసం వెళ్లకుండా వైసీపీకి చెందిన నాయ‌కుడికి ప్రచారం చేసేందుకు వెళ్లారు. శిల్పా రవిచంద్ర రెడ్డి తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై పవన్ అభిమానులు .

  • By: sn    cinema    Oct 21, 2024 5:54 PM IST
Allu Arjun|ఏపీ హైకోర్టులో పిటీష‌న్ వేసిన అల్లు అర్జున్.. కార‌ణం ఏంటంటే..!

Allu Arjun| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఈ మ‌ధ్య తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం చేయ‌డానికి ప‌వ‌న్ కోసం వెళ్లకుండా వైసీపీకి చెందిన నాయ‌కుడికి ప్రచారం చేసేందుకు వెళ్లారు. శిల్పా రవిచంద్ర రెడ్డి తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై పవన్ అభిమానులు .. అల్లు అర్జున్ తీరుపై ఇప్పటికీ గుర్రుగా ఉన్నారు.బ‌న్నీని ఏదో ఒక సంద‌ర్భంలో మెగా అభిమానులు(Mega fans) తిట్టిపోస్తున్నారు. అయితే ప్ర‌చారం కోసం బ‌న్నీ నంద్యాల‌కి వెళ్లినప్పుడు ప్రజ‌లు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఆ ఈవెంట్‌కు శిల్పా రవి లేదా అల్లు అర్జున్ తరఫున ముందస్తు అనుమతులు తీసుకోలేదు. ఈ కారణంగా, స్థానిక వీఆర్వో.. ఎలాంటి అనుమతి లేకుండా జన సమీకరణ జరిపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారంపై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.

అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిపై సెక్షన్ 144 మరియు పోలీస్ యాక్ట్ 30 అమలును ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి, అల్లు అర్జున్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. ఈ కేసును కోర్టు రేపు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాలలో ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అధికారులపై కొరడా ఝుళిపించింది. నంద్యాలలో ఎస్పీ కె.రఘువీర్‌ రెడ్డి, డీఎస్పీ ఎన్‌. రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజా రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలిచ్చింది.

వారిపై 60రోజుల్లో శాఖాపరమైన విచారణ చేయాలని సూచించింది. నాడు నంద్యాలలో ఎన్నికల సమయంలో తన మీద నమోదైన కేసు విషయంలో అల్లు అర్జున్‌ ఏపీ హై కోర్టును ఆశ్రయించాడు. తనపై పెట్టిన కేసు లో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసు విచారణకు ముందే కేసును రద్దు చేయాలని బన్నీ హైకోర్టును కోరారు. ఇక బ‌న్నీ(Bunny) ప్ర‌స్తుతం పుష్ప‌2 (Pushpa2)అనే చిత్రంతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 6న విడుద‌ల చేయ‌బోతున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ప్ర‌మోషన్స్ కూడా శ‌ర‌వేగంగా సాగుతున్నాయి.