Amitabh Bachchan |టీ20 వ‌రల్డ్ క‌ప్ ఆడే టీమ్‌కి బిగ్ బీ స్పెష‌ల్ విషెస్.. వైర‌ల్ అవుతున్న వీడియో

Amitabh Bachchan | ఐపీఎల్ 2024 మ‌హాసంగ్రామం ఇప్పుడు ఎంత ర‌స‌వ‌త్తరంగా మారుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్‌లో ఎవ‌రు విన్న‌ర్ అవుతార‌నేది ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఐపీఎల్ పూర్తైన వారానికి టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కానుంది.మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌బోయే ఈ

  • By: sn    cinema    May 02, 2024 2:35 PM IST
Amitabh Bachchan |టీ20 వ‌రల్డ్ క‌ప్ ఆడే టీమ్‌కి బిగ్ బీ స్పెష‌ల్ విషెస్.. వైర‌ల్ అవుతున్న వీడియో

Amitabh Bachchan | ఐపీఎల్ 2024 మ‌హాసంగ్రామం ఇప్పుడు ఎంత ర‌స‌వ‌త్తరంగా మారుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్‌లో ఎవ‌రు విన్న‌ర్ అవుతార‌నేది ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఐపీఎల్ పూర్తైన వారానికి టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కానుంది.మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌బోయే ఈ టోర్న‌మెంట్ కోసం ప‌లు దేశాలు తమ టీమ్స్ ను ప్రకటిస్తూ వస్తున్నాయి. టీమిండియా సైతం ఈ మినీ వార్ కోసం టీమ్ ను ప్రకటించ‌డం మ‌నం చూశాం .. వరల్డ్ కప్ లో పాల్గొనబోయే టీమిండియాకు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ స్పెష‌ల్ విషెస్ అందించాడు.. తాను లేటెస్ట్ గా నటిస్తున్న కల్కి మూవీలోని అశ్వత్థామ అవతారంలో వచ్చి.. క్రికెటర్లకు స్పూర్తినివ్వ‌డం చూస్తుంటే ప్ర‌తి ఒక్క‌రికి గూస్ బంప్స్ వ‌స్తుంది.

“టీ20 వరల్డ్ కప్ కోసం శంఖనాదం మోగింది” అంటూ ప్ర‌త్యేక‌ వీడియోను అమితాబ్ బచ్చ‌న్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చ‌చేశాడు. అశ్వత్థామ పాత్రలో బిగ్ బి కనిపిస్తూ.. క్రికెటర్లకు స్పూర్తి నింపే మాటలు చెబుతుంటే.. బ్యాగ్రౌండ్ లో కల్కీ మ్యూజిక్ వినిపిస్తుండ‌డం అటు సినీ ప్రేమికుల‌తో పాటు క్రికెట్ ప్రేమికుల‌ని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గురి చేస్తుంది. మిమ్మల్ని మీరు ఏ మాత్రం త‌క్కువ చేసుకోవ‌ద్దు. విజయం ముందు తలొగ్గొద్దే లేదు. ఇది మహా యుద్ధం. గొప్ప పోరాటం. ధైర్యంగా ఉండండి. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించండి, అవ‌స‌ర‌మైన‌ప్పుడు బలాన్ని చూపండి. ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయండి. శత్రువు కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి. అప్పుడు దేశం కోసం మీరు సిద్ధమవుతారు అంటూ అమితాబ్ క్రికెట‌ర్స్‌కి చాలా జోష్ నింపారు.

అయితే అమితాబ్ మాట‌లు చెప్పే క్ర‌మంలో తెరపై సూర్యకుమార్, విరాట్ కోహ్లీ, రోహిత్, పాండ్యాలు కనిపించిన తీరు అంద‌రిని ఆక‌ట్టుకుంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బీ అమితాబ్ కి క్రీడ‌లంటే అమితాస‌క్తి ఎక్కువ‌. ముంబైలో మ్యాచ్ లు జ‌రిగినప్పుడు అమితాబ్ త‌ప్ప‌ని పరిస్థితుల‌ల‌లో స్టేడియంకి వెళ్లి మ్యాచ్ వీక్షిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అమితాబ్ త‌న‌కు సంబంధించిన వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.ఆయ‌న తాజాగా నటించిన కల్కి చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ లాంటి భారీ తారాగాణం కల్కిలో నటిస్తున్నారు.