Amitabh Bachchan | క‌ల్కి నిర్మాత కాళ్లు మొక్క‌బోయిన అమితాబ్ బ‌చ్చ‌న్.. అంద‌రు షాక్..!

Amitabh Bachchan | ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌లో పెద్ద సినిమాల సంద‌డే లేదు. దీంతో అంద‌రు కూడా ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. భారత పురాణాల స్ఫూర్తితో నాగ్ అశ్విన్ ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న దీపికా ప‌దుకొణే న‌టించ‌గా, దిశా ప‌టాని ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇక అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాసన్ కూడా సంద‌డి చేయ‌నున్నారు. జూన్ 27న సిని

  • By: sn    cinema    Jun 20, 2024 8:21 AM IST
Amitabh Bachchan | క‌ల్కి నిర్మాత కాళ్లు మొక్క‌బోయిన అమితాబ్ బ‌చ్చ‌న్.. అంద‌రు షాక్..!

Amitabh Bachchan | ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌లో పెద్ద సినిమాల సంద‌డే లేదు. దీంతో అంద‌రు కూడా ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. భారత పురాణాల స్ఫూర్తితో నాగ్ అశ్విన్ ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న దీపికా ప‌దుకొణే న‌టించ‌గా, దిశా ప‌టాని ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇక అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాసన్ కూడా సంద‌డి చేయ‌నున్నారు. జూన్ 27న సినిమా విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూన్ 19న ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అంతా హాజ‌రై సంద‌డి చేశారు.బాహుబలి సమయం నుండి.. ప్రభాస్ కి స్నేహితుడిగా మారిన రానా దగ్గుబాటి.. ఈ ఈవెంట్ లో హోస్ట్ గా మారి ఇంప్రెస్ చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో అనేక ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

అమితాబచ్చన్.. అశ్వినీ దత్ గొప్ప‌త‌నం గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్పి ఆయన కాళ్లు మొక్కబోయారు. అప్పుడు వెంట‌నే రియాక్ట్ అయిన అశ్వినీ దత్ కూడా అమితాబచ్చన్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. ఆ స‌మ‌యంలో అమితాబ్ ప‌క్క‌కి జ‌రిగారు. ఇక అశ్వినీ దత్ చాలా గొప్ప మనిషి అని ఇంత సింపుల్ గా ఉండే నిర్మాతను తాను ఎప్పుడూ చూడలేదంటూ ప్ర‌శంస‌లు కురిపించారు బిగ్ బీ. నా దగ్గరికి నాగ్ అశ్విన్ వచ్చి కథను.. వినిపించినప్పుడు నాకు మంచి అనుభూతి క‌లిగింది. చాలా ఫ్యూచ‌రిస్టిక్‌గా క‌థ ఉంది. నాగ్ అశ్విన్ త‌న మైండ్‌తో అద్భుతం సృష్టించ‌బోతున్నాడు అని బిగ్ బీ అన్నారు.

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలతో కలిసి నటించడం గొప్ప అదృష్టం అని ప్ర‌భాస్ అన్నారు. నేను తొలిసారి కలిసినప్పుడు అమితాబ్ బచ్చన్ కాళ్లకు నమస్కరించే ప్ర‌య‌త్నం చేయ‌గా, అప్పుడు ఆయ‌న అలా చేయద్దని వారించారు. ఇంకోసారి అలా చేస్తే నేను కూడా అలా చేస్తానని అమితాబ్ అన్నార‌ని ప్ర‌భాస్ అన్నాడు. ద‌క్షిణాదిలో కూడా ఎదిగిన పాపుల‌ర్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ స‌రి అని ప్ర‌భాస్ ఉన్నాడు. ఇక క‌మ‌ల్ హాస‌న్ సినిమాలు కూడా త‌నకు చాలా ఇష్ట‌మ‌ని చెప్పిన ప్ర‌భాస్ ఆయ‌న‌లా న‌టించేందుకు తాను ఎంతో ప్ర‌య‌త్నించిన‌ట్టు కూడా తెలియజేశాడు. ఇంట్రోవర్ట్‌గా ఉండే ప్రభాస్ ఈ మాత్రం మాట్లాడడమే గొప్ప అంటూ దీపికా అత‌నిపై ప్ర‌శంస‌లు కురిపించింది. ఇక తన బేబీ బంప్‍ను చూపిస్తూ ప్రభాస్ తినిపించిన తిండి వల్లే ఇలా అయిందంటూ స‌ర‌దాగా జోక్ వేసింది.