Anand Devarakonda: విజయ్ దేవరకొండతో అనసూయకి వివాదం ఏంటి.. స్పందించిన ఆనంద్ దేవరకొండ
Anand Devarakonda: జబర్ధస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అనసూయ కొద్ది రోజుల క్రితం స్మాల్ స్క్రీన్‌కి గుడ్ బై చెప్పి వెండితెరపై వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం విమానం మంచి విజయం సాధించిన కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 చిత్రంతో పాటు పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే అనసూయ ఇటీవలి కాలంలో వివాదాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. మొన్నామధ్య విజయ్ […]

Anand Devarakonda: జబర్ధస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అనసూయ కొద్ది రోజుల క్రితం స్మాల్ స్క్రీన్‌కి గుడ్ బై చెప్పి వెండితెరపై వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం విమానం మంచి విజయం సాధించిన కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 చిత్రంతో పాటు పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే అనసూయ ఇటీవలి కాలంలో వివాదాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. మొన్నామధ్య విజయ్ దేవరకొండపై విమర్శలు గుప్పించడంతో ఆ హీరో ఫ్యాన్స్ అనసూయని ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు. వారికి అనసూయ కూడా ధీటుగానే బదులిచ్చింది.
అర్జున్ రెడ్డి చిత్రం రిలీజైనప్పటి నుంచి విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ విమర్శిస్తూ వచ్చిన అనసూయ ఇటీవల తను ఈ వివాదాల జోలికి వెళ్లను అని తెలిపింది. మనశ్శాంతి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అయితే ఇటీవల అనసూయ.. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించి బేబి మూవీపై పాజిటివ్‌గా స్పందించి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే బేబి చిత్రం జూలై 14న విడుదల కానుండగా, మూవీ ప్రమోషన్స్ లో తన అన్నతో అనసూయకి ఉన్న వివాదంపై స్పందించాడు
నాకు ఆ వివాదం గురించి కొంత మాత్రమే తెలుసు.అనసూయకి అన్నయ్యకి మధ్య పెద్ద గొడవలు లేవు. వీరిద్దరి విషయాలలో నేను లోతుగో మాట్లాడుకోవాలని అనుకోవడం లేదు. సోషల్ మీడియా వలన చాలా గొడవలు, మనస్పర్ధలు తలెత్తుతున్నాయి. నేరుగా ఒక వ్యక్తి పేరు గురించి, అతని పేరు గురించి కామెంట్ చేయలేం. అదే సోషల్ మీడియాలో మాత్రం నీ పేరు ఏంటి ఇలా ఉంది అని ధైర్యంగా అడగొడచ్చు, కామెంట్స్ చేయవచ్చు. అది మనల్ని సైకలాజికల్ గా దెబ్బ కొడుతోంది. మనకి తెలియకుండానే అందులో భాగం అవుతున్నాం అంటూ తన అన్నయ్యతో అనసూయ వివాదంపై చాలా కూల్‌గా వివరణ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ