Anasuya|ఉప్పల్ స్టేడియంలో అనసూయదే హవా.. జీవితాంతం గుర్తుంచుకుంటానంటూ పోస్ట్
Anasuya| గత రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ ఎంత రసవత్తరంగా మారిందో మనం చూశాం. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ జట్లు అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ప్రేక్షకులకి మంచి మజా దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేయగా, ఆ జటటు 3 వికెట్లకు

Anasuya| గత రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ ఎంత రసవత్తరంగా మారిందో మనం చూశాం. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ జట్లు అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ప్రేక్షకులకి మంచి మజా దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేయగా, ఆ జటటు 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58), నితీష్ కుమార్ రెడ్డి(42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 నాటౌట్) అర్ధసెంచరీలు చేయగా.. హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 నాటౌట్) మెరుపులు మెరిపించి జట్టుకి మంచి స్కోరు అందించాడు. ఇక భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఆర్ఆర్ జట్టు కూడా బాగానే ఆడింది.
202 పరుగుల లక్ష్య చేధనలో బరిలోక దిగిన రాజస్థాన్ జట్టుకి భువనేశ్వర్ పెద్ద దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్లోనే జోస్ బట్లర్(0), సంజూ శాంసన్(0) వికెట్స్ తీసాడు.. బట్లర్ క్యాచ్ ఔటవ్వగా.. సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోవడంతో కష్టాలలో పడింది. ఇక ఆ సమయంలో యశస్వి జైస్వాల్(40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67), రియాన్ పరాగ్(49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) అద్భుతమైన బ్యాటింగ్‌తో స్కోరు బోర్డ్‌ని పరుగులు పెట్టించారు. మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతూ రాగా, ఆఖరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. అయితే చివరి బంతికి భువనేశ్వర్ కుమార్ పోవెల్‌ను ఔట్ చేయడంతో విజయం హైదరాబాద్ ఖాతాలో చేరింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, నటరాజన్ రెండేసి వికెట్లు తీసారు.
అయితే ఈ మ్యాచ్‌కి వచ్చిన అనసూయ తెగ సందడి చేసింది. తన కుటుంబంతో కలిసి హాజరైన అనసూయ అందరి దృష్టిని ఆకర్షించింది. సన్‌రైజర్స్ జెండా పట్టుకుని ఊపుతూ ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ మాములు హంగామా చేయలేదు. హైదరాబాద్ బ్యాటర్లు భారీ షాట్లు కొట్టినప్పుడు, బౌలర్లు వికెట్లు తీసినప్పుడు గంతులేస్తూ తెగ సందడి చేసింది. అయితే తాను స్టేడియంలో మ్యాచ్ చూడడం మొదటి సారి అని, ఈ మ్యాచ్ ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటా అంటూ తన ఇన్‌స్టాలో పేర్కొంది. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌ను జీవితాంతం గుర్తుంచుకునేలా చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇలాగే దూసుకువెళ్లాలి. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, టీమ్ రాజస్థాన్ రాయల్స్ చాలా చక్కగా ఆడారు. ఏంటా క్లైమాక్స్!!! గ్రేట్ గ్రేట్ మ్యాచ్.’ అంటూ అనసూయ పేర్కొంది.
Anasuya😘 https://t.co/NsS8MxtPV8
— RAAI LAXMI FAN (@laxmi_raai_fan) May 2, 2024