Anchor Ravi| ఏంటి.. ఫంక్ష‌న్‌లో యాంక‌ర్ రవి భార్య‌ని అంత దారుణంగా అవ‌మానించారా?

Anchor Ravi| బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచయం అక్క‌ర్లేని పేరు యాంక‌ర్ రవి. మంచి టాలెంట్ ఉన్న ఇత‌ను ఏ షోని అయిన ఇట్టే న‌డిపిస్తుంటాడు. యాంకర్ ర‌వి పర్య‌వేక్ష‌ణ‌లో చాలా మంది కొత్త యాంక‌ర్స్ ఇండ‌స్ట్రీకి పరిచ‌యం అయ్యారు. వారిలో లాస్య, శ్రీముఖి త‌ప్ప‌క ఉంటారు. అయితే ర‌వి ఎంత పాపులారిటీ సంపాదిం

  • By: sn    cinema    May 08, 2024 2:05 PM IST
Anchor Ravi| ఏంటి.. ఫంక్ష‌న్‌లో యాంక‌ర్ రవి భార్య‌ని అంత దారుణంగా అవ‌మానించారా?

Anchor Ravi| బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచయం అక్క‌ర్లేని పేరు యాంక‌ర్ రవి. మంచి టాలెంట్ ఉన్న ఇత‌ను ఏ షోని అయిన ఇట్టే న‌డిపిస్తుంటాడు. యాంకర్ ర‌వి పర్య‌వేక్ష‌ణ‌లో చాలా మంది కొత్త యాంక‌ర్స్ ఇండ‌స్ట్రీకి పరిచ‌యం అయ్యారు. వారిలో లాస్య, శ్రీముఖి త‌ప్ప‌క ఉంటారు. అయితే ర‌వి ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో అన్ని విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నాడు. అయితే వాటిపై తాజాగా రీతూ చౌద‌రి హోస్ట్ చేస్తున్నదావ‌త్ అనే షో వేదిక‌గా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ రీతూ చౌద‌రి దావ‌త్ షోలో సెల‌బ్రిటీల‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల‌ని బ‌య‌టకు తీస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా యాంకర్ రవి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వివాదాల గురించి అడిగి తెలుసుకుంది. తాజాగా షోకి సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో కొన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

యాంక‌ర్ రవి, లాస్య మ‌ధ్య ఏదో ఉంద‌ని ఎప్ప‌టి నుండో రూమ‌ర్ ఉంది. అదేకాక త‌న‌కు పెళ్ళైన సంగతిని కూడా రవి ఎక్కువ రోజులు రివీల్ చేయలేదు. దీని గురించి రీతూ చౌద‌రి ప్ర‌శ్నించ‌గా,ఆయ‌న స‌మాధానం ఇచ్చాడు. కాని ఆ స‌మాధానం కంప్లీట్ ఎపిసోడ్ లో చూడాలి. ఇక‌ యాంకర్ రవి పక్కా కమర్షియల్ అంటగా అని రీతూ ప్రశ్నించింది. దీనికి రవి ఘాటుగానే స్పందించాడు. 100 శాతం నేను కమర్షియల్. ఎవరేమనుకున్నా ఇది నిజం. విరాట్ కోహ్లీని గల్లీలో ఫ్రీగా క్రికెట్ ఆడమంటే ఆడతాడా ? తన స్కిల్ కి తగ్గట్లుగా డబ్బు తీసుకుంటున్నాడు కదా. నేను కూడా అంతే. నాకు వ‌చ్చిన ప‌నిని డ‌బ్బులు తీసుకొని మాత్ర‌మే చేస్తాను అని చెప్పుకొచ్చాడు.

ఇక ఏ మహిళా కూడా భరించలేని అవమానం తన భార్యకి ఎదురైంది అని ఈ షోలో తెలిపారు రవి. యాంకర్ లాస్యతో రూమర్స్ వస్తున్న సమయంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలియ‌జేశాడు. త‌న భార్య‌తో క‌లిసి ర‌వి ఓ ఫంక్ష‌న్ కి వెళ్ల‌గా, అక్క‌డ కొంద‌రు త‌న భార్య‌ని ర‌వి భార్య ఆ యాంక‌ర్ క‌దా, నువ్వేంటి అత‌డిని నా మొగుడు అని చెప్పుకుతిరుగుతున్నావ్ అని అడిగార‌ట‌. దాంతో నా భార్య ఆ సంఘ‌ట‌న‌ని మ‌ర‌చిపోలేక‌పోయింది. త‌న భ‌ర్త‌ని ఇంకొక‌రి భ‌ర్త అంటే ఏ మ‌హిళ కూడా స‌హించ‌దు. రూమ‌ర్స్ వ‌ల‌న ఇలాంటి అవ‌మానాలు మాకు ఎదుర‌య్యాయ‌య‌ని ర‌వి చెప్పుకొచ్చాడు. ఇక బిగ్ బాస్ లో లహరితో జరిగిన గొడవ గురించి బదులిస్తూ అక్క‌డ‌ విషయాలని బయట జీవితాలతో పోల్చవద్దు. హౌజ్‌లో జ‌రిగిన‌ గొడవల వల్ల కొన్ని రోజులు నా కూతురు ముఖాన్ని కూడా నేను మరిచిపోయా. అంతలా బిగ్ బాస్ నా మైండ్ చెడగొట్టింది అని రవి స్ప‌ష్టం చేశాడు.