చిరంజీవికి త‌మ్ముడిగా మ‌రో మెగా హీరో..!

విధాత:ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్న చిరు మ‌రి కొద్ది రోజుల‌లో లూసిఫ‌ర్ చిత్రం చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్ని రీమేక్ చిత్రాల స్పెష‌లిస్ట్ మోహన్ రాజా తెర‌కెక్కించ‌నున్నాడు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ ,సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్నినిర్మించ‌నున్నాయి. మూవీకి సంబంధించి రోజుకొక రూమ‌ర్ బ‌య‌ట‌కి వ‌స్తుండ‌గా, అవి ప్రేక్ష‌కుల‌లో […]

చిరంజీవికి త‌మ్ముడిగా మ‌రో మెగా హీరో..!

విధాత:ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్న చిరు మ‌రి కొద్ది రోజుల‌లో లూసిఫ‌ర్ చిత్రం చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్ని రీమేక్ చిత్రాల స్పెష‌లిస్ట్ మోహన్ రాజా తెర‌కెక్కించ‌నున్నాడు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ ,సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్నినిర్మించ‌నున్నాయి. మూవీకి సంబంధించి రోజుకొక రూమ‌ర్ బ‌య‌ట‌కి వ‌స్తుండ‌గా, అవి ప్రేక్ష‌కుల‌లో అమితాస‌క్తిని క‌లిగిస్తున్నాయి.

‘లూసిఫర్’ ఒరిజినల్ వెర్షన్ లో హీరోతో పాటుగా మరో మూడు కీలకమైన పాత్రలు ఉన్నాయి. అందులో విదేశాల నుంచి వచ్చి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడే యువకుడి పాత్ర ఉంటుంది. ఇది హీరో చెప్పినట్లు నడుచుకునే తమ్ముడి పాత్ర. మలయాళంలో ఆ క్యారక్టర్ లో టోవినో థామస్ నటించాడు. తెలుగు వర్షన్ లో ఆ రోల్ లో వరుణ్ తేజ్ ని నటింపజేయాలని చూస్తున్నారట. మెగాస్టార్‌తో క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, నిహారిక న‌టించ‌గా ఇప్పుడు ఆ మంచి అవ‌కాశం వ‌రుణ్‌కి కూడా ద‌క్కుతుంద‌న్న‌మాట‌. త్వ‌ర‌లో ప్రాజెక్ట్‌కి సంబంధించి క్లారిటీ రానుంది.