Bala Krishna| బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరు వస్తారు..!
Bala Krishna| నందమూరి బాలకృష్ణ తన తండ్రి వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఒక్క జానర్‌కే పరిమితం కాకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. అయితే బాలయ్య ఈ నెలాఖరుకి సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నా

Bala Krishna| నందమూరి బాలకృష్ణ తన తండ్రి వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఒక్క జానర్‌కే పరిమితం కాకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. అయితే బాలయ్య ఈ నెలాఖరుకి సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. ‘తాతమ్మ కల’ సినిమాతో బాలయ్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా, ఈ మూవీ 1974 ఆగస్టు 30న విడుదలైంది. ఈ సినిమా విడుదలై 50 ఏళ్లు కావొస్తూ ఉండడంతో గోల్డెన్ జూబ్లీ ఈవెంట్‌ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర మినిస్టర్లు, ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకకు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా భారీ ఎత్తున ప్రముఖులు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరో హీరోయిన్ల వరకూ, ఇతర నటీనటులు, దర్శకులు, ప్రముఖ సాంకేతిక నిపుణులు అందరికీ ఆహ్వానం వెళ్లే అవకాశం ఉంది. చిరంజీవి, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, మంచు మోహన్ బాబు లాంటి బాలకృష్ణ సమకాలీన కథానాయకులకి కూడా ఆహ్వానం అందనుందని అంటున్నారు. అయితే వారు కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ . అందరు వస్తే వారిని ఒకే వేదికపై చూసి ఫ్యాన్స్ మురిసిపోవడం ఖాయం.
గతేడాది జరిగిన ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకకు వీరికి ఆహ్వానం అందిన కూడా ఎవరు హాజరు కాలేదు. అప్పుడు రామ్ చరణ్, నాగచైతన్య, సుమంత్ లు మాత్రమే వచ్చారు. మరి గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతాడా లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆహ్వాన పత్రికలో బాలకృష్ణ సినీ రంగానికి చేసిన సేవలను ప్రస్తావించారు. 1974 నుంచి 2024 వరకూ అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారని, 50ఏళ్ల సినీ ప్రయాణంలో 109 సినిమాల్లో నటించారని, అత్యధికంగా 29 మంది హీరోయిన్స్ తో కలిసి నటించారని పేర్కొన్నారు. సోషల్, మైథలాజికల్, హిస్టారికల్, జానపథ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్.. ఇలా ఆరు రకాల జానర్స్‌లో నటించిన రికార్డు బాలయ్యకు ఉంది.