రికార్డులు క్రియేట్ చేసిన భీమ్లా నాయక్ సాంగ్

విధాత:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన పాటగా ‘భీమ్లా నాయక్’ తొలి గీతం రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయం తెలుపుతూ చిత్రయూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. స్క్రీన్ ప్లే- […]

రికార్డులు క్రియేట్ చేసిన భీమ్లా నాయక్ సాంగ్

విధాత:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన పాటగా ‘భీమ్లా నాయక్’ తొలి గీతం రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయం తెలుపుతూ చిత్రయూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌కి ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా మొగులయ్య, జోసెఫ్, థమన్, శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర, రామ్ మిరియాల ఆలపించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. ఎస్. థమన్ సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ పాట 1 మిలియన్ ప్లస్ లైక్స్‌లో పాటు 17 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని సాధించింది.