బ‌న్నీ.. త్వ‌ర‌గా కోలుకోవాలి.. చ‌ర‌ణ్ దంప‌తుల స్వీట్‌ మెసేజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. స్వ‌ల్ప‌ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని, త్వ‌ర‌లోనే మిమ్మ‌ల్ని క‌లుస్తానంటూ బ‌న్నీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. బ‌న్నీకి క‌రోనా అని తెలిసిన వెంట‌నే అభిమానులు, ప‌లువురు ప్ర‌ముఖులు త్వ‌ర‌గా కోలుకోవాలి అంటూ సోష‌ల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. అంతేకాక బ‌న్నీకి కొండంత ధైర్యాన్ని అందించారు. తాజాగా అల్లు అర్జున్ బావ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బన్నీ కోలుకోవాలని స్వీట్ మెసేజ్‌తో […]

బ‌న్నీ.. త్వ‌ర‌గా కోలుకోవాలి.. చ‌ర‌ణ్ దంప‌తుల స్వీట్‌ మెసేజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. స్వ‌ల్ప‌ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని, త్వ‌ర‌లోనే మిమ్మ‌ల్ని క‌లుస్తానంటూ బ‌న్నీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. బ‌న్నీకి క‌రోనా అని తెలిసిన వెంట‌నే అభిమానులు, ప‌లువురు ప్ర‌ముఖులు త్వ‌ర‌గా కోలుకోవాలి అంటూ సోష‌ల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. అంతేకాక బ‌న్నీకి కొండంత ధైర్యాన్ని అందించారు.

తాజాగా అల్లు అర్జున్ బావ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బన్నీ కోలుకోవాలని స్వీట్ మెసేజ్‌తో పాటు కొన్ని వ‌స్తువులేమో పంపారు. వాటిని ఫొటో తీసి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకున్నారు బ‌న్నీ. చ‌ర‌ణ్ పంపిన మెసేజ్‌లో నీ ఆరోగ్యం త్వ‌ర‌గా కుదుట ప‌డాల‌ని కోరుకుంటున్నాను. నువ్వు కోలుకున్నాడ ఓ సారి క‌లుద్దాం.. ప్రేమ‌తో చ‌ర‌ణ్ అంటూ లెట‌ర్‌లో ఉంది. కాగా బన్నీ “పుష్ప”, చరణ్ “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.