జూనియర్ ఎన్టీఆర్‌కి కరోనా పాజిటివ్
టాలీవుడ్ హీరోలను కరోనా వీడడం లేదు. ఇప్పటికే పలువురు హీరోలకు కరోనా సోకింది. కొందరు హోం క్వారంటైన్‌లో ఉండగా మరి కొందరు కోలుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అభిమానులకు ట్విట్టర్ లో తెలియజేసారు తారక్. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ అంతా ధైర్యంగా ఉండండి.. నేను నా కుటుంబం అంతా చాలా బాగున్నాం.. పాజిటివ్ అని తెలిసిన వెంటనే కుటుంబం అంతా ఐసోలేట్ […]

టాలీవుడ్ హీరోలను కరోనా వీడడం లేదు. ఇప్పటికే పలువురు హీరోలకు కరోనా సోకింది. కొందరు హోం క్వారంటైన్‌లో ఉండగా మరి కొందరు కోలుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అభిమానులకు ట్విట్టర్ లో తెలియజేసారు తారక్.
‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ అంతా ధైర్యంగా ఉండండి.. నేను నా కుటుంబం అంతా చాలా బాగున్నాం.. పాజిటివ్ అని తెలిసిన వెంటనే కుటుంబం అంతా ఐసోలేట్ అయిపోయాం.. వైద్యుల సంరక్షణలోనే ఉన్నాం.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. పక్కాగా పాటిస్తున్నాం.. దయచేసి కొన్ని రోజులుగా నన్ను కలిసిన వాళ్లు వెంటనే వెళ్లి టెస్ట్ చేయించుకోండి.. ఇంట్లోనే ఉండండి’ అంటూ ట్వీట్ చేసాడు జూనియర్ ఎన్టీఆర్.
కరోనా రాకముందు కూడా ఈయన ఐసోలేషన్ లోనే ఉన్నాడు. తన స్టాఫ్ లో కొందరికి కరోనా రావడంతో వెంటనే క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు జూనియర్. అయితే అప్పుడు మాత్రం తారక్ కు కరోనా రాలేదు. ఇప్పుడు ఈ వైరస్ ఈయనకు కూడా సోకింది. దాంతో వెంటనే కుటుంబంతో పాటు ఐసోలేషన్ లోకి వెళ్లిపోయాడు తారక్.
ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదని.. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటికి వస్తానంటూ చెప్పాడు జూనియర్. ఈయన ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాతో పాటు కొరటాల, బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ సినిమాలకు కమిట్ అయ్యాడు.