Devara|సోప్ యాడ్‌లా ఉందంటూ దేవ‌ర్ సాంగ్‌పై ట్రోలింగ్.. సాలిడ్ వ్యూస్ ద‌క్కించుకున్న సెకండ్ సాంగ్

Devara| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. నిజానికి ఈ మూవీ అక్టోబర్ లో రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ముందుగా ప్ర‌క‌టించారు. కాని సెప్టెంబర్ 27 కి రిలీజ్ డేట్ ప్రీపోన్ చేశారు. అనుకున్న

  • By: sn    cinema    Aug 07, 2024 9:15 AM IST
Devara|సోప్ యాడ్‌లా ఉందంటూ దేవ‌ర్ సాంగ్‌పై ట్రోలింగ్.. సాలిడ్ వ్యూస్ ద‌క్కించుకున్న సెకండ్ సాంగ్

Devara| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. నిజానికి ఈ మూవీ అక్టోబర్ లో రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ముందుగా ప్ర‌క‌టించారు. కాని సెప్టెంబర్ 27 కి రిలీజ్ డేట్ ప్రీపోన్ చేశారు. అనుకున్నదాని కంటే ముందే ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుండ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ మూవీకి సంబంధించిన ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఈ క్ర‌మంలో దేవర నుంచి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసింది.

రీసెంట్‌గా దేవర నుండి రెండో పాటను విడుద‌ల చేయ‌గా, ఈ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంది. ఈ సాంగ్ లిరిక్స్ కైపెక్కిస్తున్నాయి. చుట్టమల్లే చుట్టేస్తోంది .. అంటూ సాగె ఈ పాటలో జాన్వీ కపూర్ – ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, అనిరుద్ మ్యూజిక్, శిల్పా మధురమైన గాత్రం పాటకు ప్రాణం పోశాయి అని చెప్పాలి. అయితే కొంద‌రు మాత్రం ఈ పాట‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఈ పాట సోప్ యాడ్ ని తలపిస్తుందని , వాటిని సంబంధించిన సీన్స్ క‌ట్ చేసి మీమ్స్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. ఎడిటింగ్ వీడియోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

దీనిపై నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ గ‌త 24 గంట‌లుగా చుట్ట‌మ‌ల్లే పాటపై ట్రోల్స్ వ‌స్తున్నాయి.ఇందులో తార‌క్ అన్న‌ని చూస్తుంటే ముచ్చ‌టేస్తుంది. జాన్వీని చూస్తుంటే ముద్దొస్తుంది.ఇంక ఎవ‌రు ఏమ‌నుకుంటే మ‌న‌కేంటి, దేనితో పోల్చుకుంటే మ‌న‌కేంటి క‌దా బాయ్స్ అని కామెంట్ పెట్టాడు. కాగా ఈ పాటకు బాస్కో మార్టిస్ అందించిన కొరియోగ్ర‌ఫీ బాగుంది. ట్యూన్స్ మాత్రం అనిరుధ్..,, శ్రీలంక ఫేమస్ సాంగ్ అయిన యొహిని పాడిన “మనికే మాగే హితే” పాటను కాపీ చేసాడని ట్రోల్స్ వచ్చాయి. దేవ‌ర రెండో సాంగ్‌ విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ కి సంబంధించి 15.68 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే లైక్స్ 497K దాకా వచ్చాయి. ఇక దీనికంటే ముందు మహేష్ బాబు సర్కారు వారి పాట లో పెన్నీ సాంగ్ (16.38M), గుంటూరు కారం ధమ్ మసాలా సాంగ్ 17.42 మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ఉన్నాయి.