Ranya Rao : నటి రన్యారావుకు రూ.102.55కోట్ల జరిమానా

బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యారావుకు డీఆర్‌ఐ రూ.102.55కోట్ల జరిమానా విధించింది. ఆస్తులు సీజ్ చేసి, ఈడీ కేసు నమోదు చేసింది.

Ranya Rao : నటి రన్యారావుకు రూ.102.55కోట్ల జరిమానా

విధాత : బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు(Ranya Rao) ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) రూ.102.55కోట్లు జరిమానా విధించింది. ఈ మేరకు ఆమెకు డీఆర్ఐ(DRI) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రన్యా సహా నలుగురు నిందితులకు మొత్తంగా రూ.270 కోట్ల పెనాల్టీ విధించింది. దుబాయ్‌ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ మార్చి తొలి వారంలో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ కేసులో రమ్యారావు సీబీఐ, డీఆర్‌ఐ విచారణ ఎదుర్కొంటుంది. ఆ కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా ఆమెపై పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది.

బంగారం అక్రమ(Gold Smuggling) రవాణాలో ఆమె పాత్రను గుర్తించిన ఈడీ తాజాగా ఆమె సంబంధించిన రూ.34 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. తన పిన తండ్రి ఐపీఎస్ హోదాను అడ్డం పెట్టుకుని ఎయిర్‌పోర్టులో తనిఖీల నుంచి తప్పించుకుంటూ బంగారం అక్రమంగా స్మగ్లింగ్ కొనసాగించింది. ఆమెకు ఇటీవల విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్‌ కార్యకలాపాల నివారణ బోర్డు ఏడాది పాటు జైలు విక్షను విధించింది. రన్యారావుతో పాటు ఆమె భాగస్వామి తరుణ్, మరో వ్యక్తి సాహిల్‌కు కూడా ఇదే శిక్ష శిక్షను ఖరారు చేసింది.