Friendship Day|ఫ్రెండ్షిప్ డే స్పెష‌ల్.. ఈ రోజు మ‌నం గుర్తు తెచ్చుకోవ‌ల్సిన హుషారైన పాట‌లు ఇవే..!

Friendship Day| క‌ష్టంలోను, ఆనందంలోను మ‌న వెన్నంట నిలిచేది ఫ్రెండ్. స్నేహితుడు లేకుండా మ‌నం జీవించ‌డం చాలా క‌ష్టం. కుటుంబ స‌భ్యుల‌తో షేర్ చేసుకోలేనిది కూడా మ‌నం స్నేహితుల‌తో షేర్ చేసుకుంటాం.జాతి, మతం, రంగు, ప్రాతం మధ్య తేడా లేకుండా ఏర్పడే స్నేహం అనే గొప్ప అనుబంధానికి గుర్తుగా ఆ

  • By: sn    cinema    Aug 04, 2024 9:21 AM IST
Friendship Day|ఫ్రెండ్షిప్ డే స్పెష‌ల్.. ఈ రోజు మ‌నం గుర్తు తెచ్చుకోవ‌ల్సిన హుషారైన పాట‌లు ఇవే..!

Friendship Day| క‌ష్టంలోను, ఆనందంలోను మ‌న వెన్నంట నిలిచేది ఫ్రెండ్. స్నేహితుడు లేకుండా మ‌నం జీవించ‌డం చాలా క‌ష్టం. కుటుంబ స‌భ్యుల‌తో షేర్ చేసుకోలేనిది కూడా మ‌నం స్నేహితుల‌తో షేర్ చేసుకుంటాం.జాతి, మతం, రంగు, ప్రాతం మధ్య తేడా లేకుండా ఏర్పడే స్నేహం అనే గొప్ప అనుబంధానికి గుర్తుగా ఆగ‌స్ట్ తొలి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా మనం జ‌రుపుకుంటాము. అయితే సినిమాల‌లో కూడా ఫ్రెండ్షిప్ పైన చాలా పాట‌లే వ‌చ్చాయి. అవి ఒక‌సారి గుర్తు చేసుకుంది. ‘హుషారు’ సినిమాలో ఫ్రెండ్స్ అంతా కలిసి పాడుకోవడం కోసం హుషారైన పాటను రాశారు కృష్ణకాంత్. జీవితంలో అన్ని కష్టాలు కలిసి దాటిన తర్వాత సంతోషం వైపు అడుగులేస్తూ పాడుకునే పాట ఇది.

‘ప్రేమదేశం’ అనే సినిమా లోని ముస్తఫా ముస్తఫా అనే పాటను వినని ప్రేక్షకులు మాత్రం చాలా అరుదు. ఇప్పటికే ఫ్రెండ్‌షిప్ డే వస్తే ఇదే పాటను మ‌నం వింటుంటాం. పాడుకుంటూ ఉంటాం. ఈ సినిమా విడుద‌లై 30 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్ప‌టికీ ఇందులోని పాట మాత్రం ప్రేక్ష‌కుల మ‌దిలో అలా నిలిచి ఉంది.ఇక ‘హ్యాపీ డేస్’ సినిమాలోని ఓ మై ఫ్రెండ్ అనే పాట ఎంత ఫేమ‌స్ అనేది మ‌నంద‌రికి తెలిసిందే. ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఫ్రెండ్షిప్ మొదలు కాగా, ఫేర్‌వెల్ పార్టీలో ఆ పాట పాడుకుంటూ కంట క‌న్నీళ్లు పెట్టుకుంటారు. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ఈ పాట‌కి అందించిన సంగీతం అదుర్స్.

‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలోని ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే పాట కూడా స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌నం పాడుకుంటూ ఉంటాం. జగపతి బాబు హీరోగా నటించిన ‘పెళ్లి పందిరి’ సినిమా మొత్తం ఫ్రెండ్‌షిప్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాలోని ‘నేస్తమా ఇద్దరి లోకం ఒకటే’ అనే పాట‌తో పాటు ‘దోస్త్ మేరా దోస్త్’ పాట‌లు స్నేహితుల పండ‌గ రోజు వినిపిస్తూనే ఉంటాయి.ఇక స్టూడెంట్ నెం1 చిత్రంలోని ఎక్క‌డో పుట్టి ఎక్క‌డో పెరిగి అనే పాటని కూడా స్నేహితులు ప‌లు సంద‌ర్భాల‌లో పాడుకోవ‌డం మ‌నం చూస్తూ ఉంటాం. ఇలా మీ ఫ్రెండ్స్‌తో కలిసి పాడుకునే పాటలు తెలుగులోనే చాలా ఉన్నాయి. అందులో ఇవి ప్ర‌త్యేక‌మైన‌వి అని చెప్పాలి.