Heeramandi| హీరామండి సాంగ్‌కి అదిరిపోయే డ్యాన్స్ చేసిన 54 ఏళ్ల మహిళ.. వీడియో వైరల్
Heeramandi| బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సంజయ్ లీలా భన్సాలీ తొలి వెబ్ సీరీస్ హీరామండి వెబ్ సిరీస్ ఇప్పుడు ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతోంది. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. హిందీలో రూపొందిన

Heeramandi| బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సంజయ్ లీలా భన్సాలీ తొలి వెబ్ సీరీస్ హీరామండి వెబ్ సిరీస్ ఇప్పుడు ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతోంది. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. హిందీలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర మొత్తం 14 భాషలలోను స్ట్రీమింగ్ అవుతోంది.స్వాతంత్రోద్యమానికి పూర్వం హీరామండి లోని వేశ్యల జీవితాన్ని, వారి జీవితంతో ముడిపడిన స్వతంత్ర పోరాటాన్ని గొప్పగా చూపించి ప్రేక్షకులని ఎంతగానో అలరించారు భన్సాలి. భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ రూపొందగా, దీని కోసం 70కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ వెబ్ సిరీస్లో మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, సంజీద షేక్, షర్మిన్ సెగల్ ప్రధానపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ లో మరో కీలక పాత్రను పోషించిన అదితిరావు హైదరికి కోటిన్నర రూపాయల పారితోషికం ఇచ్చినట్టుగా సమాచారం అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్డాకు కోటి రూపాయలు , వహీదాగా నటించిన సంజీదా షేక్ కు నలభై లక్షలు, ఆలంజేబ్ గా నటించిన షర్మిన్ సెగల్ కు 35లక్షలు పారితోషికంగా ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలోని సైయాన్ హత్తో జావో” పాటలో అదితి రావ్ హైదరీ పర్‌ఫార్మెన్స్ అందిరిని ఆకట్టుకుంది. ఇప్పుడు అచ్చం అదితి మాదిరిగా 54 ఏళ్ల మహిళ తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది.
నడివయసులో ఉన్న నీరూ సైనీ అనే మహిళ తన డ్యాన్స్ వీడియోలను తరచూ పోస్ట్ చేస్తూ.. నెట్టింట హల్‌చల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే నీరూ సైనీ తాజాగా హీరామండి మ్యూజిక్‌కి స్టెప్పులేసింది. నడి వయసులోనూ ఆమె వేసిన ఎనర్జెటిక్ స్టెప్పులు చూసిన నెటిజన్లు ఫీదా అయిపోయారంటే మీరు నమ్మలేరేమో..! కానీ ఆమె డ్యాన్స్ వీడియోలను చూస్తే మీరే అనుకుంటరు.. ఈ వయసులో కూడా ఆమె ఎలా ఇంత ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ వేసింది. ఛత్తీస్‌ఘడ్‌లో స్పోర్ట్స్ టీచర్‌గా పనిచేస్తున్ననీరూ సైనీకు స్వతహాగా డ్యాన్స్ చేయడంలో ప్రత్యేక అభిరుచి ఉంది. అందుకే ఇంత అందంగా డ్యాన్స్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆమె డ్యాన్స్, ఇంకా తన ఎనర్జీ లెవెల్స్ చూసి అశ్చర్యపోతున్నారు. ఇదే విషయాన్ని వారు ఆ వీడియో కింద కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.
View this post on Instagram