వామ్మో… #RC16 స్క్రిప్ట్ పనులకే అన్ని కోట్లా..? ఓ సినిమా తీయొచ్చు
#RC16 రామ్‌చరణ్–బుచ్చిబాబు సనాల సినిమా. ప్రస్తుతం ప్రిప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మరోవైపు స్క్రిప్ట్ వర్క్ కూడా శరవేగంతో సాగుతోంది. ఇక్కడే ఒక కనీవనీ ఎరుగని విచిత్రం జరిగింది.

రామ్‌చరణ్, బుచ్చిబాబుల ఆర్సీ16(#RC16) త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే పాన్–ఇండియా సినిమాగా, సరికొత్త కథతో ఉండబోతోందని విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం మరో రికార్డును కూడా షూటింగ్ మొదలవడానికి ముందే సృష్టించింది. కథ తాలూకు స్క్రిప్ట్ పను(Script Work)ల కోసం, మరిన్ని మెరుగులు దిద్దడం కోసం ప్రముఖ రచయిత(Veteran Writers)లను రంగంలోకి దింపాడు. స్క్రిప్ట్ పనుల కోసమే ఓ ఆఫీసు కూడా ఓపన్ చేసిన బుచ్చిబాబు వీటన్నింటికీ కలిపి దాదాపు మూడు కోట్ల రూపాయలు.. వీరు విన్నది నిజమే. స్క్రిప్ట్ పనులకే 3 కోట్లు( Rs. 3 Crores for Script works) ఖర్చు పెడుతున్నాడట. ఇప్పటి వరకు తెలుగు చిత్ర సీమలో స్క్రిప్ట్‌కు ప్రత్యేకంగా ఖర్చుపెట్టడం ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా. మూడు కోట్లంటే బలగం లాంటి సినిమా అవలీలగా తీసేయొచ్చు. ఈ విధంగా స్క్రిప్ట్‌కు కూడా ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి ఆర్సీ16 ఓ సరికొత్త రికార్డును తనపేర లిఖించుకుంది. First of its kind.
ఉప్పెన(Uppena).. దిగ్దర్శకుడు సుకుమార్(Sukumar) పరిచయం చేసిన తన ప్రియ శిష్యుడు సానా బుచ్చిబాబు(Buchibabu Sana) దర్శకత్వం వహించిన మొదటి సినిమా. ఊహించని విజయం అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా బుచ్చిబాబు స్క్రిప్ట్‌ను డీల్ చేసిన విధానం పెద్ద పెద్ద దర్శకులను, హీరోలను ఆలోచనలో పడేసింది. అందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కూడా ఉన్నారు. ఇంతలో తన రెండో కథను సిద్ధం చేసుకున్న బుచ్చిబాబు, దాన్ని ఎన్టీఆర్(Jr.NTR)తో తీయాలనుకుని చాలా నెలలు వేచిచూసాడు. కానీ, ఎన్టీఆర్ కమిట్మెంట్ దేవరతో ఉండటంతో, ఆయన సలహాపై రామ్‌చరణ్‌ను సంప్రదించాడు. అప్పటికే ఎన్టీఆర్ నుండి కాల్ అందుకున్న చరణ్, ఆ మట్టి కథకు బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఒక గ్రామీణ క్రీడాకారుడి జీవిత చరిత్ర(Rural Sports Drama)గా చెప్పబడుతున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్(Ramcharan) పచ్చజెండా ఊపాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా కథను ఎంతగానో ప్రశంసించాడు. దాంతో ఈ సినిమా ఖాయమైంది. మైత్రీ మూమీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాయి. సంగీత దర్శకుడిగా ప్రపంచ ప్రసిద్ధ ఏఆర్ రహమాన్(AR Rehaman)ను ఎంచుకున్నారు. బుచ్చిబాబు కథ రహమాన్‌ను బాగా కదిలించింది. ఆయనా బండెక్కేసారు. ఇక హీరోయిన్. హ్యాపెనింగ్ హీరోయిన్గా దేశంలో బాగా నానుతున్న పేరైన జాన్వీకపూర్(Janhvi Kapoor)ను ఖరారు చేసారు. జగదేకవీరుడి కొడుకుకి, అతిలోక సుందరి కూతురు జతగా మారింది. దీంతో ఒక్కసారిగా ఆర్సీ16 రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్‌కు ఇది మరో ప్రయోగాత్మక చిత్రం. రంగస్థలం(Rangasthalam)తో మట్టి కథలను కూడా తన నటనతో బంగారంగా మార్చగలిగే స్థాయికి చేరుకున్న చరణ్ దీనికి మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతున్నాడు కూడా.
పాన్ ఇండియా సినిమాగా రెండో సినిమానే పేరు తెచ్చుకోవడంతో బుచ్చిబాబు స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందునా పెద్ద హీరోతో మొదటి సినిమా. ఎటువంటి రిస్కూ తీసుకోదలుచుకోలేదు. అందులో భాగంగానే ప్రముఖ రచయితలను స్క్రిప్ట్పనుల్లోకి దింపాడు. సుకుమార్ రైటింగ్ డిపార్ట్మెంట్ ఎలాగూ ఉండనేఉంది. ఈ రచయితలు స్క్రిప్ట్‌ను పరిశీలించి అవసరమైన, సూచనలు, సలహాలు ఇవ్వడం, వాటిని అమలు చేసిన తర్వాత మళ్లీ చెక్ చేసి బాగుంటే ఓకే అనడం, లేకపోతే మరో వర్షన్ తయారుచేయడం జరుగుతోంది. ఆఖరికి ఎలాగూ సుకుమార్ చూసి, స్టాంప్ వేసి సంతకం పెట్టాలనుకోండి.
అదీ విషయం.. ఏఆర్ రహమాన్, రత్నవేలు(Ratnavelu) లాంటి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు, తమిళ, కన్నడ చిత్రసీమ నుండి విజయ్ సేతుపతి(Vijay Sethupathi), శివ రాజ్‌కుమార్(Siva Rajkumar) లాంటి మహానటులు, జాన్వీకపూర్ కథానాయికగా పనిచేయబోతున్న ఈ సినిమాకు ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు వెనుకాడటం లేదు. అందుకే స్క్రిప్ట్ వర్క్‌కు కూడా బడ్జెట్ కావాలనగానే, కథ మీద నమ్మకంతో మూడు కోట్లు కేటాయించేసారట.