అందాల ఛార్మి పెళ్లి చేసుకోబోతోందా?

అందాల ఛార్మి (33)ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతోందట. ఇపుడు ఈ వార్తే టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది.14 ఏళ్ల వయసులోనే ‘నీతోడు కావాలి’ అంటూ టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ అమ్మానాన్న చెప్పిన వరుడినే త్వరలోనే పెళ్లాడనుందట. అయితే పెళ్లిపై తనకు నమ్మకం లేదనీ, తనకెలాంటి తోడు అవసరం లేదని గతంలోనే కుండబద్దలు కొట్టిన ఈ గ్లామర్‌ గాళ్‌ ఇపుడిక మనువుపై మనసు పడినట్టు సమాచారం. తమ సమీప బంధువుతో కలిసి ఏడడగులు నడిచేందుకు సిద్ధమవుతోందట ఛార్మి. ఈ […]

అందాల ఛార్మి పెళ్లి చేసుకోబోతోందా?

అందాల ఛార్మి (33)ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతోందట. ఇపుడు ఈ వార్తే టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది.14 ఏళ్ల వయసులోనే ‘నీతోడు కావాలి’ అంటూ టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ అమ్మానాన్న చెప్పిన వరుడినే త్వరలోనే పెళ్లాడనుందట. అయితే పెళ్లిపై తనకు నమ్మకం లేదనీ, తనకెలాంటి తోడు అవసరం లేదని గతంలోనే కుండబద్దలు కొట్టిన ఈ గ్లామర్‌ గాళ్‌ ఇపుడిక మనువుపై మనసు పడినట్టు సమాచారం.

తమ సమీప బంధువుతో కలిసి ఏడడగులు నడిచేందుకు సిద్ధమవుతోందట ఛార్మి. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ భార్య లావణ్య కూడా త్వరలో పెళ్లి చేసుకో బేబీ అని ఛార్మీని ఎంకరేజ్‌ చేస్తోందట. ఎపుడూ తన భర్తను అంటి పెట్టుకునే ఉండటాన్ని ఇన్నాళ్లూ లైట్‌ తీసుకున్న లావణ్య, ఈ మధ్య ఛార్మిని కలిసి మరీ పెళ్ళి చేసుకోమని గట్టిగానే సలహా ఇచ్చిందంట. కాదు కాదు..హెచ్చరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చార్మి పెద్దవాళ్ల నిర్ణయం తరువాత అతణ్ని త్వరగా పెళ్ళి చేసుకోమని చెప్పిందట లావణ్య.

మూడు పదుల వయసు దాటినా ఇప్పటిదాకా పెళ్లి ఊసెత్తని చార్మి పూరితో డేటింగ్‌లో ఉన్న పుకార్లు చాలా కాలంలో ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ అనే నిర్మాణం సంస్థను మెుదలుపెట్టారు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరీ కనక్ట్స్‌ బ్యానర్స్‌ పై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. పూరీకి సంబంధించిన వ్యవహారాలల్లో పూర్తిగా తలమునకలైన ఈ అమ్మడు విజయవంతంగా దూసుకు పోతోంది. అలాగే ఇస్మార్ట్ శంకర్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో వీరిలో జోష్ పెరిగిన సగతి తెలిసిందే.

కాగా స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర​ దేవిశ్రీ ప్రసాద్‌తో డేటింగ్‌లో ఉందని త్వరలోనే పెళ్లి అంటూ గతంలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఎవరు, ఏంటి వివరాలను ప్రస్తావించకుండానే తాను ప్రేమలో విఫలమయ్యానంటూ ఛార్మి ఆ మధ్య వెల్లడించింది. అంతేకాదు తనకు, పెళ్లికీ పడదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మరి తాజా గాసిప్స్‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి