Nabha Natesh | కన్నడ బ్యూటీ కెరీర్ గాడిలో పడేనా…? ‘స్వయంభూ’పైనే నభా నటేష్ ఆశలు..!
Nabha Natesh | నభా నటేష్ (Nabha Natesh) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వజ్రకాయ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది కన్నడ బ్యూటీ. నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్ (Tollywood)లోకి ఎంట్రీ ఇచ్చింది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

Nabha Natesh | నభా నటేష్ (Nabha Natesh) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వజ్రకాయ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది కన్నడ బ్యూటీ. నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్ (Tollywood)లోకి ఎంట్రీ ఇచ్చింది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ తర్వాత పూరీ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) మూవీలో నటించిన నభాకు గుర్తింపే వచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. తెలుగులో 2021లో మాస్ట్రో మూవీలో కనిపించిన బ్యూటీ ఆ తర్వాత హఠాత్తుగా తెరపై నుంచి కనుమరుగైంది. అయితే, 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడింది. దాంతో దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది.
మళ్లీ ఈ ఏడాది డార్లింగ్ మూవీతో మళ్లీ తెరంగేట్రం చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తున్న ‘స్వయంభూ’ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నది. స్వయంభూలో మరో హీరోయిన్‌గా సంయుక్త సైతం నటిస్తున్నది. నభా చేసింది కొద్ది సినిమాలే అయినా యూత్‌లో క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. పూరీ జగన్నాథ్, రామ్ పోతితేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఓవర్‌నైట్ స్టార్‌గా చేసింది. తెలుగులో ఇప్పటి వరకు ఎనిమిది చిత్రాల్లో నటించినింది. అయితే, ఇందులో ఇస్మార్ట్ శంకర్, నన్నుదోచుకుందువటే సినిమా మినహా మిగతా సినిమాలు పెద్దగా గుర్తింపును తీసుకురాలేకపోయాయి. ప్రస్తుతం కన్నడ బ్యూటీ కేవలం ‘స్వయంభూ’ మూవీపైనే భారీ అంచనాలు పెట్టుకున్నది. ఈ మూవీతో కెరీర్‌ను గాడిలో పెట్టుకోవాలని చూస్తున్నది. మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోషూట్లతో అభిమానులకు దగ్గరగా ఉంటున్నది.