Janhvi Kapoor: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బోనీకపూర్ ఫ్యామిలీకి ఎంతో క్రేజ్ ఉంది. ముఖ్యంగా వీరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ సినిమాల్లో ఎంటర్ టైన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా వస్తున్న ఎన్టీఆర్ 30 మూవీతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇదే టైమ్ లో తెలుగు హీరోతో ప్రేమలో పడిన జాన్వీ కపూర్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో బోనీకపూర్ కి కాబోయే అల్లుడు […]
Janhvi Kapoor: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బోనీకపూర్ ఫ్యామిలీకి ఎంతో క్రేజ్ ఉంది. ముఖ్యంగా వీరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ సినిమాల్లో ఎంటర్ టైన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా వస్తున్న ఎన్టీఆర్ 30 మూవీతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇదే టైమ్ లో తెలుగు హీరోతో ప్రేమలో పడిన జాన్వీ కపూర్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో బోనీకపూర్ కి కాబోయే అల్లుడు ఇతనే అంటూ పోస్టులు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్త ప్రజంట్ అటు బాలీవుడ్ ని, ఇటు టాలీవుడ్ లోనూ ఫుల్ గా ట్రెండ్ అవుతుంది.
is
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డెబ్యూ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ నిజంగానే తెలుగు హీరోతో ప్రేమలో పడిందా.. పడితే అతను ఎవరు అనే రేంజ్ లో అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్య జాన్వీకపూర్ టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోని ఎక్కువగా కలుస్తుంది. అంతేకాదు.. నెక్ట్స్ ప్రాజెక్ట్ తనతో చేయడానికి కూడా ట్రై చేస్తుందట. డైరెక్టర్స్ తో కూడా ఈ విషయంలో మాట్లాడేస్తుందట. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటున్నారు. అలాగే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ తెలుగు హీరోని తెగ పొగిడేసింది.
ఛాన్స్ దొరికితే ఆ హీరోతో డేటింగ్ కూడా చేస్తానని ఓపెన్ గా చెప్పేసింది. దీంతో పాటు ఇప్పటికే జాన్వీకపూర్ బాలీవుడ్ లో ఓ అబ్బాయిని లవ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి ఉంటే ఈ పాటికి అతనితో పెళ్లి కూడా అయిపోయి ఉండేదని అంటున్నారు. బోనీకపూర్ ఈ విషయంలో సరిగ్గా పట్టించుకోవట్లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా టాలీవుడ్ లో జాన్వీ కపూర్ ఇష్టపడే ఆ తెలుగు స్టార్ హీరో తెలియాలంటే మాత్రం ఇంకాస్త సమయం వెయిట్ చేయాల్సిందే. ఇక జాన్వీ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఒక్కటంటే ఒక్క పెద్ద హిట్ కూడా అందుకోలేదు.