Jagapathi Babu : ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో హోస్టుగా జగపతి బాబు!
జగపతి బాబు హోస్ట్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో ఆగస్టు 17 నుంచి జీ తెలుగు, ZEE5లో ప్రారంభం. తొలి అతిథి నాగార్జున జ్ఞాపకాలు పంచుకోనున్నారు.

Jagapathi Babu | విధాత : టాలీవుడ్ సీనియర్ హీరో..విలన్ జగపతి బాబు(Jagapathi Babu) త్వరలో బుల్లితెరపై ఓ టాక్ షో లో హోస్ట్ గా అభిమానులను అలరించబోతున్నారు. ఆగస్టు 17వ తేది నుంచి జీ తెలుగు(Zee Telugu), జీ5లో(Zee5) ప్రసారం కానున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammura) టాక్ షోలో హోస్ట్ పాత్రలో జగపతిబాబు బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఈ షో ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ టాక్ షోకు మొదటి అతిథిగా టాలీవుడ్ సీనియర్ హీరోఅక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హాజరవుతున్నారు. ఈ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టాక్ షోకు ట్యాగ్ లైన్ ‘ చిరునవ్వులతో సాగే ఈ కొత్త ప్రయాణం’ అని జోడించారు.
‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammura) విత్ జగపతిబాబు తొలి షోలో నాగార్జున తన చిన్ననాటి జ్ఞాపకాలు, వ్యక్తిగత వివరాలు, విలువైన కుటుంబం జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. నాగార్జునతో పాటు ఆయన బ్రదర్ వెంకట్, సిస్టర్ నాగ సుశీల ల సరదా సంభాషణలతో ఈ షోను రక్తికట్టించబోతున్నారు. ఈ టాక్ షో లో పాల్గొనే అతిథుల నుంచి ఎప్పుడూ వినని విశేషాలను జగపతి బాబు అభిమానుల ముందుంచుతారని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం కేవలం ఒక టాక్ షో మాత్రమే కాదు .. ఒక కొత్త ప్రయాణం. ఈ షోకు వచ్చే అతిథులు తమ మనసులోని భావాలను పంచుకోవడంతో పాటు తమ జీవిత ప్రయాణంలో జరిగిన సంఘటనలు, మరుపురాని ఘట్టాలను గుర్తుచేసుకోవడానికి ఒక వేదికగా నిలుస్తోందని నిర్వాహకులు ప్రోమోలో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి…